అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశేషాలు

బాల‌య్య ఓ ట్రాన్స్‌ఫార్మ‌న్‌.. ఇండ్ర‌స్ట్రీకి శివుడు

అఖండ టీజ‌ర్ ట్రైల‌ర్లు, పాట‌ల‌కు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమాకి ప‌నిచేసిన సాంకేతిక నిపుణులు కూడా `ఇది ష్యూర్ షాట్ హిట్` అని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ఇప్పుడు త‌మ‌న్ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట‌ప్ చేశాడు. “ఈ సినిమాలో 70 సీన్లు ఉంటే… 50 సీన్లు నిల‌బ‌డే చూస్తారు. థియేట‌ర్లో ఎవ‌రూ కూర్చోరు..“ అంటూ అభిమానుల‌కు స్వీట్ న్యూస్ ఇచ్చేశాడు. అఖండ సినిమాకి త‌మ‌న్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రీ రికార్డింగ్ కోస‌మే త‌మ‌న్ 45 రోజ‌లు క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త‌మ‌న్ మాట్లాడాడు.

“యేడాదిన్న‌ర‌గా శివుడి ట్రాన్స్‌లో ఉన్నా. ఈ సినిమాకి రీ రికార్డింగ్ పూర్తి చేసి, నేరుగా బాల‌కృష్ణ గారి ఇంటికి వెళ్లి, ఆయ‌న ఆశీర్వాదం తీసుకోవాల‌నిపించింది. మా ఇండ్ర‌స్ట్రీకి ఆయ‌న శివుడు లాంటివారు. ఆయ‌న చాలా స్పిరుట్యువ‌ల్. ఆ ఎన‌ర్జీ అంతా మాకు పంచారు. 45 రోజుల పాటు ఏ ప‌నీ పెట్టుకోకుండా ఈ సినిమాకి ఆర్‌.ఆర్ అందించాను. ఈ సినిమానా మైండ్ లో బాగా దిగిపోయింది. బాల‌య్య ఓ ట్రాన్స్ ఫార్మ‌ర్‌. ఆయ‌న‌కు స‌రిపోయేంత క‌రెంట్ స‌ప్ల‌య్ చేస్తుంటారు బోయ‌పాటి. నా కెరీర్ బాల‌య్య బాబు సినిమా భైర‌వ‌ద్వీపంతో మొద‌లైంది. ఆ సినిమాకి రూ.300 జీతం తీసుకున్నా. ఆ విష‌యం నాకెప్ప‌టికీ గుర్తుంటుంది“ అని పాత జ్ఙాప‌క‌ల్ని గుర్తు చేసుకున్నాడు త‌మ‌న్‌.

భుజం నొప్పితో… బాల‌య్య సూప‌ర్ స్టెప్పులు

నంద‌మూరి బాల‌కృష్ణ భుజానికి ఇటీవ‌ల ఆప‌రేష‌న్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చేతికి క‌ట్టుతోనే క‌నిపిస్తున్నారు. అఖండ ప్రీ రిలీజ్ వేడుక‌కీ అలానే వ‌చ్చారు. ఈ ఆప‌రేష‌న్‌కీ, ఆక‌ట్టుకీ.. ఒకానొక విధంగా నేను కూడా బాధ్యుడ‌నే అంటూ కొత్త విష‌యం చెప్పారు బోయ‌పాటి శ్రీ‌ను. వివ‌రాల్లోకి వెళ్తే..

ఈ సినిమాలో ‘జై బాల‌య్య‌’ అనే మాస్ పాట ఒక‌టుంది. ఆపాట కోసం కోటిన్న‌ర‌తో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. కొంత భాగం షూటింగ్ అయ్యాక.., బాల‌య్య అల‌సిపోవ‌డంతో, ఇంటికి వెళ్లి, ఒళ్లు నొప్పులు త‌గ్గ‌డానికి ఎక్స‌ర్ సైజులు చేశార్ట‌. ఆ స‌మ‌యంలో.. బాలెన్స్ కుద‌ర‌క‌, కింద ప‌డ్డార‌ని, అలా భుజానికి గాయం అయ్యింద‌ని, ఆ గాయంతోనే త‌దుప‌రి రోజు షూటింగ్ కి బాల‌య్య వ‌చ్చార‌ని బోయ‌పాటి తెలిపారు. ”భుజం నొప్పితో ఎలా డాన్స్ చేస్తారు.. వ‌ద్దు.. ఈ సినిమాలో ఉన్న‌ మాస్ పాట ఇదొక్క‌టి మాత్ర‌మే. చేస్తే బాగా చేద్దాం.. లేదంటే ఆపేద్దాం అన్నాను. కానీ.. ఇప్పుడే చేద్దాం.. అభిమానుల కోసం ఆ మాత్రం చేయ‌లేనా` అంటూ బాధ‌ని పంటిబిగువున ప‌ట్టి… డాన్స్ చేశారు.ఆ పాట వెనుక బాల‌య్య అంత క‌ష్ట‌ప‌డ్డారు” అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను.

త్వ‌ర‌లో బాల‌య్య భ‌క్తి ఛాన‌ల్‌

బాల‌కృష్ణ ఓ టీవీ ఛాన‌ల్ ప్రారంభిస్తున్నారా? అందులోనూ భ‌క్తి ఛాన‌ల్. అవును. ఈ విష‌యాన్ని బాల‌కృష్ణ‌నే స్వ‌యంగా చెప్పారు. `అఖండ‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో బాల‌కృష్ణ ఈ ప్రస్తావ‌న‌చ తెచ్చారు. ఇదే వేదిక‌పై అల్లు అర్జున్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయన్ని చూడ‌గానే బాల‌య్య‌కు `ఆహా`.. అందులో తాను చేస్తున్న `అన్ స్టాప‌బుల్‌` గుర్తొచ్చాయి. దాని గురించి ప్ర‌స్తావిస్తూ, మాటల మ‌ధ్య‌లో భ‌క్తి ఛాన‌ల్ ని తీసుకొచ్చారు. త్వ‌ర‌లో తాను భ‌క్తి ఛాన‌ల్ ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. అది నిజ‌మేనా? లేదంటే స‌ర‌దాగా అన్నారా? అనేది మాత్రం తెలీదు. బాల‌య్య‌కు భ‌క్తి శ్ర‌ద్ధ‌లు ఎక్కువ‌. ఆయన్ని ఎప్పుడు క‌దిలించినా, పురాణాల గురించో, ప‌ద్యాల గురించో, శాస్త్రాల గురించో వ‌ర్ణిస్తుంటారు. శ్లోకాలు – వాటి అర్థాలు చెబుతుంటారు. ఆ ఆస‌క్తితోనే భ‌క్తి ఛాన‌ల్ ప్రారంభిస్తున్నారేమో..? ఏది ఏమైనా అఖండ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సాక్షిగా.. బాల‌య్య భ‌క్తి ఛాన‌ల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మ‌రి ఆ ఛాన‌ల్ ఎప్పుడు తెరుస్తారో, ఏంటో..? ఆ వివ‌రాలు తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close