పేదలపై ఇంత రుబాబా ? ఓట్లేసింది వాళ్లేనని గుర్తు లేదా !?

ఆంధ్రప్రదేశ్‌లో వన్ టైం సెటిల్మెంట్ పథకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 1983 నుంచి ప్రభుత్వఇళ్ల లబ్దిదారుల దగ్గర్నుంచి రూ. పది నుంచి రూ. ఇరవై వేలు వసూలు చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పుడు పరుగులు పెడుతోంది. టార్గెట్లు నిర్దేశించుకుని మరీ ప్రజల్ని పీడిస్తున్నారు. అందరూ నిరుపేదలే. ప్రభుత్వ పథకాలపైఆధారపడి బతుకుతున్న వారే్. ఇలాంటి సమయంలో వారి నుంచి రూ. పదివేలు , రూ. ఇరవై వేలు వసూలు చేయాలన్న ఆలోచనే దారుణం అయితే.. అది వారి మేలుకే అన్న ఓ రకమైన ప్రచారం చేస్తూ డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేయడం మరీ దారుణంగా ఉంది.

ప్రభుత్వం స్వచ్చందం అని చెబుతోంది.కానీ నిర్బంధమని అధికారులు.. వాలంటీర్లు సహా అందరూ నిరూపిస్తున్నారు. గ్రామ వాలంటీర్ స్థాయిలో లబ్దిదారులందర్నీ గుర్తించి ఆ మేరకు వారికి ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా చోట్ల పేదలు కట్టడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నోటి మాటగా ఆదేశించారు. పథకాలు ఆపేస్తున్నారు. డ్వాక్రా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి వాలంటీర్లు అప్పులు ఇప్పిస్తున్నారు. ఇవన్నీ బహిరంగరహస్యాలు.

ప్రభుత్వం .. రూ. మూడు లేదా .. నాలుగు వేల కోట్లను వసూలు చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందు కోసం సచివాలయాలు, మండలం, పట్టణాల వారీగా లక్ష్యం నిర్దేశించారు. ప్రతి మండలానికి రోజుకు 50, పట్టణంలో సచివాలయానికి 5 చొప్పున ఓటీఎస్‌ కింద కట్టించాలని టార్గెట్ పెట్టారు. వార్డు, గ్రామ వాలంటీరు రోజుకు ఒకటి, పంచాయతీ కార్యదర్శి 3కు తక్కువ లేకుండా చూడాలని మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇలా అందరికీ ఒక్కో తరహా లక్ష్యం విధించారు। దీంతో అందరూ పరుగులు పెడుతున్నారు. పేదల మెడపై కత్తి పెడుతున్నారు.

ప్రస్తుతం వసూలు అవుతున్నడబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తోంది. కానీ పేదల గురించి.. వారి ఓట్ల గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే.. వారు కూడా జగనన్న అని చెప్పి ఓట్లేసిన వాళ్లే. అన్నీ ఉచితం.. అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూండటం చాలా మందిని అసంతృప్తికి గురి చేస్తోంది. అది ఓట్ల రూపంలో బయటపడితే మొత్తానికే మోసం వస్తుంది. దీన్ని ఎప్పటికి గుర్తిస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close