పార్లమెంట్‌లో వైసీపీ లాంగ్వేజ్ వినిపిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ !

వైసీపీ అధికార భాషగా మారిపోయిన బూతులు, బెదిరింపులను ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. గతంలో టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తెలుగులోఆయన బూతులు అందుకునేవారు. ఇప్పుడు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ప్రాంగణంలో రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రఘురామరాజు తర్వాత స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల కిందట సీబీఐ కేసుల అంశంపై మాట్లాడినప్పుడు కూడా దారుణంగా బూతులు తిట్టారని.. స్వయంగా పార్లమెంట్‌లోనే బూతులు మాట్లాడారని రఘురమకృష్ణరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్లీ బుధవారం కూడా అదే సీన్ రిపీట్ అయిందని ఆయన స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు. తన అంతు చూస్తానని.. చంపుతానని బెదిరిస్తున్నారని రఘరామ ఆరోపించారు. పార్లమెంట్‌లోని ఇతర ఎంపీలు ఎంపీ గోరంట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కనీస మర్యాద లేకుండా కేకలేయడం వంటివి చేస్తూండటంతో ఆయన వైపు అందరూ అదోలా చూస్తున్నారు. అయితే ఎంపీ గోరంట్ల మాత్రం అదే తనకు అప్పగించిన పని కాబట్టి అలాగే చేస్తానన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఆయనను స్పీకర్ కంట్రోల్ చేయకపోతే ఏపీ అసెంబ్లీ తరహా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close