2021 రివైండర్: ఆశలు రేపి… అంచనాలు తప్పి..

2020తో పోల్చుకుంటే 2021 చిత్ర పరిశ్రమకి కొంత ఉపసమనం ఇచ్చింది. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితి నుంచి చిత్ర పరిశ్రమ కొంచెం తేరుకుంది. చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మంచి అంచనాలు మధ్య వచ్చిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. తప్పుకుండా విజయం సాధిస్తాయనే నమ్మకం కలిగించిన సినిమాలు అపజయం బాట పట్టాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..

అల్లుడు అదుర్స్: ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍ మళ్ళీ ఒక పక్కా కమర్షియల్ సినిమా చేయాలని నిర్ణయించుకొని చేసిన సినిమా అల్లుడు అదుర్స్. సంతోష్‍ శ్రీనివాస్‍ లాంటి పక్కా కమర్షియల్ డైరెక్టర్, నభా నటేష్‍, అను ఎమాన్యుయేల్‍, సోను సూద్‍, ప్రకాష్‍రాజ్‍ ఇలా స్టార్లందరినీ కాస్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. చోటా కె. నాయుడు కెమరా. టీజర్, ట్రైలర్ చూసి,.. ఏదో నవ్వించేలా వున్నారే ? అనే ఆశలు రేపారు. తీరా సినిమా చూస్తే.. డిజాస్టర్ అనిపించింది. ‘రాక్షసుడు’ లాంటి మంచి కంటెంట్ వున్న సినిమా చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍.. మళ్ళీ ఇలాంటి తలాతోక లేని కథని నమ్ముకొని ఓ అపజయాన్ని ఖాతాలో వేసుకోవడం తప్పితే ‘అల్లుడు అదుర్స్’ ఇంకెలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

చెక్: చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే ఒక బ్రాండ్. ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ గా చంద్రశేఖర్ ఏలేటికి ఒక ఇమేజ్ వుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే సీరియస్ సినిమాని ఇష్టపడే వారిలో ఒక ఆసక్తి వుంటుంది. ఈసారి నితిన్ లాంటి యూత్ ఫుల్ హీరో చందుతో కలిశాడు. దీంతో ‘చెక్’ కాంబినేషన్ సహజంగానే ఆసక్తిని రేపింది. అయితే సినిమా మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఇటు చందూ మార్క్ సినిమా కాలేదు.. అటు నితిన్ ఫ్యాన్స్ ని అలరించలేదు. ఏవో హాలీవుడ్ సినిమాలని గుర్తు చేస్తూ .. కొంచెం కమర్షియల్ టచ్ ఇస్తూ చందూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చందు సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర పెద్ద విజయాలు కానప్పటికీ విమర్శకులు ప్రశంసలు అందుకున్న సినిమాలే. అయితే చెక్ పై విమర్శకులు కూడా పెదవి విరిచారు.

గాలి సంపత్ : శ్రీ విష్ణు మంచి నటుడు. అనిష్ కృష్ణ క్లాస్ టచ్ వున్న దర్శకుడు. అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్. ఈ ముగ్గురు ‘గాలి సంపత్’ కోసం కలిశారు. చిత్రానికి అనిల్ రావిపూడి స్వయంగా స్క్రీన్ ప్లే అందించాడు. దీంతో సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఒక హాలీవుడ్ కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమా ఇక్కడ ప్రేక్షకులని అలరించలేకపోయింది. పైగా పాతకాలం నాటి ట్రీట్మెంట్ తో సహనానికి కూడా పరీక్ష పెట్టింది. ఆకాశంలో శివ లింగం, గోతిలోకి చిప్స్ ప్యాకెట్లు.. ఇవన్నీ ‘అతి’ సినిమా లిబార్టీ అనే ఫీలింగ్ కలిగించాయి. ట్రెండీగా స్క్రీన్ ప్లే రాసే అనిల్ రావిపూడి.. గాలి సంపత్ ని ఇంత పాతగా ట్రీట్ చేశారేంటి ? అనే అనుమానం కూడా కలిగింది.

చావుకబురు చల్లగా : కార్తికేయ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన సినిమా చావుకబురు చల్లగా. ఈ కాంబినేషన్ సహజంగానే అంచనాలు పెంచింది. అల్లు అర్జున్ లాంటి స్టార్.. ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొని సినిమాపై క్రేజ్ ని పెంచాడు. సినిమా నుండి విడుదలైన పాటలు కూడా ఏదో కొత్త కథలా వుందే అనే ఆసక్తిని పెంచింది. తీరా సినిమా చూసేసరికి కొత్తదనం వుంది కానీ అది అందరికీ నచ్చే కొత్తదనం అనిపించలేదు. కాన్సెప్ట్ బావున్నా.. అది మానవ సంబంధాలనే ఎబ్బెట్టుగా చూపించే ప్రయత్నం ఒక సినిమాలో పెట్టడం రుచించలేదు. ఏదో వేదాంతం చెప్పే ప్రయత్నం జరిగింది కానీ అది జనాలు మెచ్చే ఫిలాసఫీ కాలేకపోయింది.

అరణ్య : రానా పాన్ ఇండియా నటుడు. ఆయన నుంచి నుంచి ఓ సెమీ పాన్ ఇండియా మూవీగా వచ్చింది అరణ్య. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల చేశారు. మొదట ఈ సినిమాలో రానా లుక్కు ఆసక్తిని పెంచింది. బాహుబలి తర్వాత రానా నుంచి వస్తున్న సినిమా కావడం మరో పాయింట్. అడవి నేపధ్యం, ఏనుగులు .. ఇవన్నీ కూడా క్యురీయాసిటీని పెంచాయి. అయితే సినిమా మాత్రం నిరాశ పరిచింది. అటవీ పరిరక్షకుడి రానా కష్టపడినప్పటికీ.. చాలా ప్రెడిక్టిబుల్ కధనంతో ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని పంచలేకపోయింది అరణ్య. అయితే ఇందులో రానా నటన మాత్రం హైలెట్.

శ్రీదేవి సోడా సెంటర్ : పలాస సినిమాతో ఆకట్టుకున్నాడు కరుణ కుమార్. భలే సినిమా తీసేశాడే అనే పేరు తెచ్చుకున్నాడు. పలాస డైరెక్టర్ గా మొదటి సినిమాకే ఒక ఇమేజ్ వచ్చింది. సుదీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ ని తెరక్కించాడు. ట్రైలర్,టీజర్ ఇవన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. కరుణ నుంచి మరో మంచి సినిమా వస్తుందనే నమ్మకం కలిగింది. సినిమా మాత్రం అంచనాలని తారుమారు చేసింది. బీసీ కాలం నాటి ఓ ప్రేమకథని తీసుకొని దాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం.. ఎమోషనల్ గా మిస్ ఫైర్ అయ్యింది. అసలు పలాస తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది? అనే అనుమానం కలిగింది. పైగా పలాస వున్న కులం, వర్గం, ఎక్కువ , తక్కువ నేపధ్యాలు.. శ్రీ దేవి సోడా సెంటర్ లో కూడా కనిపించాయి. కానీ ఈ ప్రేమ కథకు ఆ ట్రీట్మెంట్ వర్క్ అవుట్ కాలేదు.

టక్ జగదీశ్: నిన్ను కోరి, మజిలీ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు శివ నిర్వాణ. నానితో టక్ జగదీశ్ సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్ లోకి రాలేదు. అమోజన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అది ఒక మంచికే. థియేటర్ లోకి వచ్చివుంటే నాని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యేవారు. ఒక డైలీ సీరియల్ సరిపడే కథ, కధనంతో టక్ జగదీస్ ని మలిచాడు దర్శకుడు. అమోజన్ ప్రైమ్ లో వచ్చి సరిపోయింది కానీ థియేటర్ లో రిలీజ్ చేసివుంటే ఒక డిజాస్టర్ నాని ఖాతాలో పడేది. నానికి కథల మంచి గ్రిప్పు వుంటుంది. కానీ టక్ జగదీశ్ చూసేసరికి అసలు ఇలాంటి కథని నాని ఎలా ఓకే చేశాడు ? అనేంత నీరసంగా అనిపించింది టక్ జగదీశ్.

మ్యాస్ట్రో : బాలీవుడ్ లో శ్రీరామ్ రాఘవన్ తీసిన అంధధూన్ క్లాసిక్. మ్యాస్ట్రోగా నితిన్ రీమేక్ చేశాడు. నేరుగా హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్ ని మక్కీకి మక్కీ దించేశారు. అయితే అంధధూన్ ఆత్మని పట్టుకోవడం దర్శకుడు మేర్లపాక గాంధీ విఫలమయ్యాడు. సీన్ ని సీన్ గా తీశాడు తప్పితే.. అంధధూన్ లో వున్న ఇంటన్సిటీ మ్యాస్ట్రోలో కనిపించలేదు. పాత్రలు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. అంధధూన్ పంచిన థ్రిల్ ని మ్యాస్ట్రో పంచలేకపోయాడు.

రిపబ్లిక్ : దేవకట్టా నుంచి చానళ్ళ తర్వాత మళ్ళీ సినిమా వచ్చింది. ఈసారి సాయిధరమ్ తేజ్ తో రిపబ్లిక్ తీశాడు. రిపబ్లిక్ ఆలోచన బావుంది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం బాలేదు. సోషల్ పాఠన్ని చదివినిపిస్తున్నట్లు, ఒక ఆర్టికల్ కి అర్ధం చెప్తున్నట్లు ఉంటుందే కానీ థియేటర్ లో ఒక సినిమా చూస్తున్నామనే అనుభూతి అయితే కలిగించలేకపోయిందీ సినిమా. ‘మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం, కానీ ప్రజాస్వామ్యం గురించి ఎంతమందికి తెలుసు ?’ అనే ఆలోచన నుంచి పుట్టిన రిపబ్లిక్ సినిమా ఎలాంటి ఆలోచనని కలిగించకుండానే ఆసక్తిగా లేని ఒక పిరియడ్ ముగిసిపోయిందనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.

మహాసముద్రం: ఆర్ఎక్స్ 100 సంచలనం తర్వాత అజయ్ భూపతి నుంచి వచ్చిన సినిమా మహాసముద్రం. శర్వానంద్, సిద్దార్ద్, అతిది రావు, అను ఇమ్మేన్యుల్, జగపతి బాబు.. ఇలా బోలెడు స్టార్ కాస్ట్. విడుదలకు ముందు భారీ అంచనాలు. ఇది కూడా ఒక సంచలనం అవుతుందనే నమ్మకాలు. దర్శకుడు అజయ్ భూపతి కూడా ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సినిమా మాత్రం డిజాస్టర్. తెరపై ఎన్నో పాత్రలు కనిపిస్తున్నా .. ఒక్క పాత్రకి మరో పాత్రకి ఎలాంటి ఎమోషనల్ కనెక్ట్ లేకుండా సాగిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా.. చాలా చప్పగా అనిపించింది. శర్వానంద్, సిద్దార్డ్, అతిధి లాంటి మంచి నటులు వున్నప్పటికీ .. బిగిలేని కథ, కధనాలతో ఫ్లాఫ్ జాబితాలో చేరింది.

మంచి రోజులు వచ్చాయి : మారుతి సినిమా అంటే మినిమం వినోదం గ్యారెంటీ నమ్మకం. ఈ లాక్ డౌన్ లో చకచక” మంచి రోజులు వచ్చాయి’ తీశారు. నేరుగా థియేటర్ లో రిలీజ్ చేశారు. సినిమా చూశాక .. ఈ మాత్రం సినిమాకి థియేటర్ అనవసరం అనే ఫీలింగ్ కలిగింది. నిజానికి ఓటీటీ సరిపోయే సినిమా ఇది. చాలా తక్కువ బడ్జెట్ లో లిమిటెడ్ లోకేషన్స్ లో సినిమాని చుట్టేశారు. మారుతి ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని చుట్టూ కొంచెం బలంగా వర్క్ చేస్తారు. కానీ మంచి రోజులు వచ్చాయిలో ఆ బలం కనిపించదు. మొత్తానికి మారుతిలో ఖాతాలో మంచి రోజులు రూపంలో ఒక ఫెయిల్యూర్.

అనుభవించు రాజా: రాజ్ తరుణ్ ఓ హిట్ కోసం తహతహలాడుతున్నాడు. ఎన్ని జోనర్లు మార్చిన హిట్ రావడం లేదు. దీంతో మళ్ళీ తనకు కలసొచ్చిన వినోదాన్ని నమ్ముకొని చేసిన సినిమా అనుభవించు రాజా. అన్నపూర్ణ లాంటి బ్యానర్ లో వచ్చిన సినిమా కావడంతో సహజంగానే కంటెంట్ బావుంటుందనే భరోసా కలిగించింది. కానీ సినిమా మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. వినోదాన్ని పడించే అవకాశం ఉన్నప్పటికీ లైన్ ని సరిగ్గా పట్టుకోవడంలో ఇబ్బంది పడిపోయాడు దర్శకుడు. ఒక ఫన్ క్యారెక్టర్ ని సృష్టించి ఫన్ తో వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నప్పటికీ.. దానికి మర్డర్ మిస్టరీ జోడించి చివరికి ఎమోషనల్ గా తేలిపోయింది. ఈ సినిమా విజయంపై ఆశలుపెట్టుకున్న రాజ్ తరుణ్ కి కూడా నిరాశనే మిగిల్చింది.

స్కై లాబ్ : సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ .. వీళ్ళంతా మంచి నటులు. వీరు ప్రధాన పాత్రలలో ఒక సినిమా వస్తుందంటే సహజంగానే ఒక ఆసక్తి వుంటుంది. స్కై లాబ్ పై కూడా అలానే ఆసక్తి కలిగింది. సినిమాలో ట్రైలర్ కూడా విషయం వుందనిపించింది. తీరా థియేటర్ లోకి వచ్చేసరికి.. ఆలోచన బావుంది కానీ ఆచరణ బాలేడనే ఫీలింగ్ కలిగించింది. పాయింట్ ని బాగానే వుంది. కానీ ఆ పాయింట్ ని జ‌న‌రంజ‌కంగా మ‌లిచే విష‌యంలో మాత్రం తడబడ్డారు.

గమనం : ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే గమనం పై మంచి సినిమా అవుతుందేమో ఫీలింగ్ కలిగింది. ఇళయరాజా సంగీతం, సాయి మాధవ్ బుర్రా మాటలు, శ్రియా లుక్కు.. ఇవన్నీ ప్రామెసింగ్ అనిపించాయి. ఈ సినిమా కోసం థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఇది కమర్షియల్ సినిమా కాదనే సంగతి ముందే తెలుసు. మంచి కధని చూస్తామనే అంచనాతో టికెట్టు తీసుకున్నారు. కానీ గమనం ఆ నమ్మకాన్ని కలిగించలేపోగా.. ఎడిషనల్ గా కాస్త శిరోభారంగా కూడా అనిపించింది. మూడు క‌థ‌లని తీసుకున్నారు కానీ అందులో ఒక్క క‌థ‌లోనూ అద్భతం అనిపించలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close