ఏపీలో వైసీపీ వేధింపులా? ఇదిగో సుజనా రక్షణ…

ఘరానా మొగుడు సినిమాలో ఓ విజిటింగ్ కార్డు చూపించి… అది కేవలం విజిటింగ్ కార్డు కాదు.. విష్ముమూర్తిచేతిలో భూచక్రం అని చెబితే… హీరో నిజమే అనుకుని అంత కాన్ఫిడెన్స్‌గా ప్రొసీడ్ అయిపోతాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఎంపీ సుజనా చౌదరి ఆంద్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున బెదిరింపులు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పుకుని బదెరింపులకు దిగుతున్నారని.., ఇలాంటి వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. అసలు గొడవేంటి అన్న వివరాలను మెయిల్ చేయాలని కోరారు.

ఆ మెయిల్ అడ్రస్ పేరు.. saveandhrapradesh2022@gmail.com. ఈ మెయిల్ అడ్రస్‌కు .. బెదిరింపులకు గురైన వారి వివరాలు పంపితే మిగతా విషయాలు తాను చూసుకుంటానని సుజనా చౌదరి చెబుతున్నారు. విశాఖలో హయగ్రీవ్ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు.. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేతపై దాడి వంటి విషయాలను సుజనా చౌదరి గుర్తించారు. అయితే సుజనా చౌదరి ఇక్కడ చిన్న షరతు పెట్టారు. అదేమిటంటే.. ముందుగా బెదిరింపులకు గురవుతున్న వారుపోలీసులకు ఫిర్యాదు చేయాలట.

ఆ ఫిర్యాదు కాపీలను కూడా తనకు పంపాలట. మిగతాది తాను చూసుకుంటానంటున్నారు. ఏపీలో ఇలాంటి ఫిర్యాదులు చేయడం.. . చేసి ప్రశాంతంగా ఉండటం… ప్రాణాలు కాపాడుకోవడం అంత సులువైన ప ని కాదని.. సుజనా చౌదరికి ఇంకా అర్థమైనట్లుగా లేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న ఏపీ ప్రజలను కాపాడటానికి సుజనాచౌదరి ఇంకా సరళమైన మార్గాన్ని కనిపెట్లాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close