ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో రూ. 70 కోట్ల నగదు పట్టుకున్న ఐటీ! ఎవరిది అది ?

ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పుకుంటున్న సమూహ రియల్ ఎస్టేట్‌లో అనే సంస్థపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో రూ. 70 కోట్ల నగదుతోపాటు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్దగా ఎవరికీ తెలియని సమూహ రియల్ ఎస్టేట్ వద్ద రూ. డెబ్బై కోట్లకుపై నగదు పట్టుబడటం సంచలనాత్మకం అయింది. ఈ సంస్థ ఎవరిది..? ఈ సంస్థ వెనుక ఎవరున్నారన్న ఆసక్తికర చర్చ వ్యాపార, రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

సమూహ రియల్ ఎస్టేట్ సంస్థను గత ఏడాది మార్చి నెలాఖరున రిజిస్టర్ చేశారు. అంటే ఇరవై నెలలు మాత్రమే అయింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. కానీ రూ. కోట్లకు కోట్ల నగదు ఆసంస్థ వద్ద బయటపడింది. అనితా నేనా, అనురూప కుర్రా అనే ఇద్దరు మహిళలను ఈ సంస్థకు డైరక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ ఏదైనా బడా రియల్ ఎస్టేట్ కంపెనీకి బినామీ లేదా.. రాజకీయ నాయకుడికి బినామీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు

ఈ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు బ్లాక్ మనీతోనే వ్యవహారాలు నడుపుతూ ఉంటాయి. ఈ కారణంగానే వాటి వద్ద పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో సమూహ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఎవరిది.? వారికి నగదు ఎక్కడినుంచి వచ్చిందన్నదానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. లేదంటే ఇతర కేసుల్లాగే మురిగిపోయే అవకాశం ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close