టికెట్ రేట్ల గురించి మాట్లాడ‌డం రాజ‌కీయమా?

టికెట్ రేట్ల వ్య‌వ‌హారంపై నాగార్జున క‌ప్ప‌దాటు వైఖ‌రి… విస్మ‌ర ప‌రిచే విష‌య‌మే. `టికెట్ రేట్ల‌తో నాకు ఇబ్బంది లేదు..` అంటూ ఈ విష‌యంపై మాట్లాడ‌డానికి నాగార్జున నిరాక‌రించ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓవ‌ర్గానికి మింగుడుప‌డ‌డం లేదు. చిత్ర‌సీమ అంతా.. టికెట్ రేట్లు పెంచండి బాబూ.. అంటూ మొత్తుకుంటుంటే, `నాకు ఎంతున్నా ఫ‌ర్వాలేదు..` అని నాగ్ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యమే.

సీనియ‌ర్ హీరోగా చిత్ర‌సీమ ఇబ్బందుల గురించి మాట్లాడాల్సిన బాధ్య‌త నాగార్జున‌కు ఉంది. పైగా నాగార్జున ఓ నిర్మాత కూడా. ప‌రిశ్ర‌మ గురించి, ఇక్క‌డి ఇబ్బందుల గురించి ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపే వ్య‌క్తుల్లో ముందు వ‌రుస‌లో ఉండే పేరు నాగార్జున‌. ఆమ‌ధ్య ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల్ని క‌లిసిన‌ప్పుడు, తెలంగాణ‌లో శ్రీ‌నివాస యాద‌వ్ తో స‌మావేశం అయిన‌ప్పుడు నాగార్జున ఉన్నాడు. మ‌రి ఇప్పుడెందుకు ఈ క‌ప్ప‌దాటు వ్య‌వ‌హారం? `సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయం మాట్లాడ‌ను` అన్న‌ది నాగ్ మాట‌. సినిమా రేట్ల గురించి, ఓ సినిమా వేడుక‌లో మాట్లాడ‌డం రాజ‌కీయం ఎందుకు అవుతుంది? ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ గొంతు చించుకుని ట్వీట్లు చేస్తున్నాడు.. అది రాజ‌కీయ‌మా? నాని.. టికెట్ రేట్ల వ్య‌వ‌హారంలో మాట్లాడ‌డం రాజ‌కీయ‌మా?

బంగార్రాజు ఈనెల 14న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడితే.. త‌న సినిమాకి ఏమ‌వుతుందో అన్న‌ది నాగ్ భ‌యం కావొచ్చు. ఏపీలో త‌గ్గిన టికెట్ రేట్ల‌తో… క‌చ్చితంగా వ‌సూళ్ల‌లో భారీ మార్పులు క‌నిపిస్తాయి. రావాల్సిన లాభాలు త‌గ్గుతాయి. సినిమా అటూ ఇటూ అయితే.. న‌ష్టాలూ త‌ప్ప‌క‌పోవొచ్చు. వాట‌న్నింటికీ నాగ్ సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాని ముందే.. జీ సంస్థ‌కు అమ్మేశాడు నాగార్జున‌. ఇప్పుడు లాభాలొచ్చినా, న‌ష్టాలొచ్చినా తన‌కొచ్చిన ఇబ్బందేం లేదు. అందుకే సైలెంట్ గా తప్పుకున్నాడు. కాక‌పోతే.. ప‌రిశ్ర‌మ త‌ర‌పున నిల‌బ‌డి, ప‌రిశ్ర‌మ వైపు నుంచి మాట్లాడాల్సిన త‌రుణంలో.. నాగ్ ఇలా మౌనంగా ఉండిపోవ‌డం, రేటు ఎంతున్నా ఫ‌ర్వాలేదు అన‌డం.. ప‌రిశ్ర‌మ‌కు మేలు చేసే విష‌యం ఎంత‌మాత్రం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close