పట్టు వదలని “ఫెడరల్ విక్రమార్కుడు” కేసీఆర్ !

ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమని రాజకీయ విశ్లేషకులుఅందరూ చెబుతున్నా… పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్న పద్దతిలో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఉండి తీరాలన్న లక్ష్యంతో ఆయన ప్రగతి భవన్‌ నుంచే ప్లాన్లు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్‌, విజయన్, ఏచూరి, లాలూ తనయుడు తేజస్విలతో చర్చలు జరిపిన ఆయన త్వరలో శరద్‌పవార్‌తోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్న స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌‌ భావిస్తున్నారు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ కు పరిస్థితులు కలిసి రాలేదు. ప్రత్యేక విమానాలేసుకుని అందర్నీ కలిసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మరోమారు అలాంటి ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంపైనే కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు.

కేసీఆర్ .. తన ఫెడరల్ ప్రయత్నాలన్నీ బీజేపీ కోసమేనని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా పార్టీలను దూరం జరిపి.. విపక్ష ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇతరులు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో స్టాలిన్ తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని.. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయని కేసీఆర్ నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే భేటీలు కొనసాగిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close