మునిసిపల్ కార్మికులంటే ప్రభుత్వాలకి ఇంత అలుసా?

అది దేశ రాజధాని డిల్లీ కావచ్చు లేదా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావచ్చు…ఎంత గొప్ప నగరమయినా మునిసిపల్ కార్మికుల చేయిపడనిదే ఆ నగరాలు పరిశుభ్రం కాలేవు వాటికి అందం ఏర్పడదు. కానీ డిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా మునిసిపల్ కార్మికులంటే ప్రభుత్వాలకు అలుసే. డిల్లీలో అయితే ఏకంగా మూడు నెలలు జీతాలే చెల్లించలేదు. మునిసిపల్ కార్మికుల వారి ఓపిక నశించడంతో జీతాల కోసం ధర్నాలు చేయవలసిన అగత్యం ఏర్పడింది. అప్పుడు కానీ వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ఇక ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలలో కూడా గత వారం రోజుల నుండి మునిసిపల్ కార్మికులు తమ జీతాలు పెంచమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. కారణాలు ఏవయినప్పటికీ కానీ రెండు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

మునిసిపల్ కార్మికులు తమ కుటుంబాలను పోషించేందుకు ఎండనకా వాననకా రోడ్లమీద, చెత్త కుప్పల మధ్య కష్టపడి పనిచేస్తుంటారు. తమ ఆరోగ్యాన్నే కాదు ఒక్కోసారి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి భూగర్భ డ్రైనేజి గొట్టాలలో ప్రవేశించి శుభ్రం చేస్తూ మునిసిపల్ కార్మికులు మరణించిన సందర్భాలున్నాయి. మరి అటువంటి కార్మికులకి జీతాలు పెంచడానికి అభ్యంతరం ఏమిటి? నిధుల కోరతా? అయితే నిత్యం ఏసీ గదుల్లో ఉంటూ, ఏసీ కార్లలో, విమానాలలో తిరిగే ప్రజాప్రతినిధుల జీతాలు రెండింతలు, మూడింతలు ఏవిధంగా పెంచుకోగలుగుతున్నారు? వారి జీతభత్యాలు పెంచుకోవడానికి, ఖరీదయిన ల్యాప్ టాపులు, టాబ్లెట్లు, సెల్ ఫోన్లు బహుమతులుగా ఇచ్చుకోవడానికి నిధుల కొరత లేనప్పుడు మునిసిపల్ కార్మికుల జీతాలు పెంచవలసినప్పుడే ఎదురవుతోందా? అనే ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాని నియమించుకొన్నందుకు ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉదారంగా రెండు కోట్లు చెల్లించగలిగినప్పుడు, ఆయన నిర్వహిస్తున్న స్వచ్చ భారత్ మహాయజ్ఞంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న మునిసిపల్ కార్మికులకి జీతాలు పెంచడానికి అభ్యంతరం ఏమిటి? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూనే, ప్రజా ప్రతినిధులకి చాక్లెట్లు పంచిపెట్టినట్లు ఖరీదయిన టాబ్లెట్ పీసీలు పంచుతూ, పుష్కరాల కోసం, వాటిలో తన ప్రచారం కోసం కోట్ల రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేస్తున్న చంద్రబాబు నాయుడు మునిసిపల్ కార్మికులకి జీతాలు పెంచడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? అనే ప్రశ్నలకి వారే సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది.

ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, సినీ తారలు వచ్చి చీపుర్లు పట్టుకొని మీడియాకి ఫోజులు ఇచ్చినంత మాత్రాన్న స్వచ్చ భారత్ సాధ్యం కాదు. దేశ వ్యాప్తంగా కటిక దరిద్రం అనుభవిస్తున్న మునిసిపల్ కార్మికులు రేయనకా, ఎండనకా, చలనకా, వాననకా 365 రోజులు పనిచేస్తున్నారు కనుకనే స్వచ్చ భారత్ అమలవుతోంది తప్ప సెలబ్రెటీల వలన కాదు. కనుక ప్రభుత్వాలు మునిసిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూడకుండా వారి సమస్యలని పరిష్కరించి, వారి జీవితాలలో కూడా వెలుగులు నింపే ప్రయత్నం చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close