తెదేపాను ముంచడానికే వైకాపా ఎమ్మెల్యేలు వెళ్తున్నారా?

ఒకవేళ అచ్చంగా ఆ పార్టీని ముంచే ఉద్దేశంతో వెళుతున్నప్పటికీ కూడా.. ఆ విషయాన్ని బహిరంగంగా ఎవరూ ఒప్పుకోరు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రోజా తన వ్యాఖ్యలతో తెదేపాలోకి వెళ్తున్న వైకాపా వారి మీద కొత్త అనుమానాలు పుట్టే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఈ ఫిరాయింపుల నేపథ్యంలో.. తనదైన శైలిలో చంద్రబాబు మీద విరుచుకుపడిన రోజా.. ఫిరాయిస్తున్న వారిని సహజంగానే తిట్టిపోశారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఇలా వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వలన తెలుగుదేశానికే నష్టం అని.. ఎంత ఎక్కువ మంది చేరితే ఆ పార్టీ అంత తొందరగా మునిగిపోతుందని రోజా అంటున్నారు.

తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో గానీ.. రోజా మాటలు వింటే మాత్రం.. తెలుగుదేశాన్ని ముంచడానికే వైకాపా ఎమ్మెల్యేలను వీళ్లే ట్రెయిన్‌ చేసి పంపుతున్నట్లుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.

ఈ సందర్భంగా రోజా మాత్రం చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడుకు వయసు అయిపోయిందని.. ఆయనకు చూపు కూడా మసకబారిపోయిందని.. పార్టీ మీద పట్టు సన్నగిల్లిపోయిందని తన వైఫల్యాల మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. ఇలాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని రోజా అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన వైకాపాకు వచ్చే నష్టం ఏమీ లేదని రోజా వ్యాఖ్యానించారు. వెళ్లిపోయిన వారు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆమె డిమాండ్‌ చేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఒక పార్టీ పెట్టి, ఒక సీటు అయినా సాధించగలరా అంటూ ఆమె డిమాండ్‌ చేయడం విశేషం. చంద్రబాబు, లోకేశ్‌ అవినీతి అంతా దోచుకుంటున్నారని, అవినీతిలో వారు డబుల్‌ డిజిట్‌ సాధించారని ఆమె దుయ్యబట్టారు. ఇన్ని నిందలు వేసినప్పటికీ.. వైకాపా నేతలు ఎంత ఎక్కువ మంది తెదేపాలోకి వెళితే అంత తొందరగా ఆ పార్టీ మునిగిపోతుందంటూ రోజా భవిష్య వాణి వినిపించడమే చిత్రమైన సంగతిగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close