కేబినెట్ విస్తరణను కేసీఆర్ మర్చిపోయారా !?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏదీ కలసి రావడం లేదు. తెలంగాణలో గత ఏడేళ్ల కాలంలో ఆయన హయాంలో మంచి అభివృద్ధి సాధించిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు కూడా నిరంతర విద్యుత్, మిషన్ భ గీరథ వాటర్ .. రైతులకు ప్రాజెక్టులు ఇలా దీర్ఘ కాలిక ప్రయోజనాలు కలిగే ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆయనపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. దీన్ని ఎలా డీల్ చేయాలో కేసీఆర్‌కు కూడా అర్థం కానట్లుగా ఉంది. కుల, మత సమీకరణాలు.. ఇతర రాజకీయాలతో కవర్ చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదు.

మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ మార్పుచేర్పులు చేస్తే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో.. సరైన సమయం రాలేదని ఆగిపోతున్నారు. సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనిఅన్నారు. కానీ ఇప్పుడా ఆలోచన ఉన్నట్లుగా స్పష్టత లేదు. ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్.. ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. కానీ పరిస్థితులు బాగో లేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని.. అదే జరిగితే.. వచ్చే ఏడాది చివరిలో జరగాల్సిన సమయంలోనే జరుపుతారని… మంత్రివర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు.

రాజకీయ వ్యూహ ధురంధురిడిగా పేరొందిన కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. ఆయన వ్యూహాలపై ఆయనకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రశాంత్ కిషోర్ టీం సేవలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. ఆయన తన సొంత రాజకీయ నిర్ణయాలు.. కాన్ఫిడెన్స్‌గా తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close