మ‌హేష్ ప్లేస్ లో విజ‌య్‌దేవ‌రకొండ‌

సౌత్‌లో దుమ్ము దులుపుతున్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స్థానం సంపాదించుకున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడెక్ట్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అవ‌త‌రించాడు. ప్ర‌ఖ్యాత కోకాకోలా కంపెనీకి చెందిన‌ థ‌మ్స్ అప్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్లు విజ‌య్ చేతికి వ‌చ్చాయి.

సౌత్‌లో పాపుల‌ర్ హీరోల‌తోనే థ‌మ్స‌ప్ యాడ్లు చేస్తుంటుంది. అప్ప‌ట్లో చిరంజీవి థ‌మ్స్ అప్ యాడ్‌లో క‌నిపించ‌డం గుర్తుండే ఉంటుంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ యాడ్ మ‌హేష్ చేతిల్లో ఉండేది. ఇప్పుడు విజ‌య్ ద‌గ్గ‌ర‌కు చేరింది. చిరు, మ‌హేష్ చిత్రసీమ‌లో అద్భుత‌మైన విజ‌యాలెన్నో అందుకున్న త‌ర‌వాత‌… ఈ యాడ్లు వాళ్లకు అందాయి. అయితే విజ‌య్ అంత టైమ్ తీసుకోలేదు. అతి త‌క్కువ వ‌యసు, త‌క్కువ సినిమాల‌తోనే పాపులారిటీ సంపాదించి, థ‌మ్స‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎదిగాడు. త‌న‌పై తెర‌కెక్కించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్లు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి ప్రసారం కానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close