కేసీఆర్‌పైనా బీజేపీది అదే పొలిటికల్ “సర్జికల్ స్ట్రైక్స్”

పుల్వామా దాడి తర్వాత ప్రతీకారంగా భారత్ సైన్యం పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంశం మొదటి నుంచి వివాదాస్పదమవుతూనే ఉంది. ఇటీవల రాహుల్ గాంధీపై అస్సాం సీఎం … సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ ఆధారాలు అడిగారని.. ఆయన ఎవరికి పుట్టారో తాము ఆధారాలు అడిగామా అని ప్రశ్నించారు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో రాహుల్‌కు కేసీఆర్‌ మద్దతుగా నిలిచారు.ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడారని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లుగా ఆధారాలు అడుగుతున్న రాహుల్ గాంధీ అంశంపై స్పందిస్తూ అందులో తప్పేమి ఉందన్నారు.

రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని… సర్జికల్ స్ట్రయిక్స్​కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్​ డిమాండ్​ చేశారు. అంతే రాహుల్‌నే టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఇక కేసీఆర్ కూడా దొరికినట్లయింది. భారత ఆర్మీని కేసీఆర్ కించ పరుస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అభినందన్ వర్థమాన్ సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు సుదీర్గమైన ట్వీట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అ సోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారుని ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి వి మురళీధరన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ ను ప్రశ్నిస్తే ఆపరేషన్‌లో పాల్గొన్న మన వీర జవాన్లను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఇలాంటి వాటిని రాజకీయాలకు వాడుకోవడంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అయితే మొదట్లో ఉన్నంత భావోద్వేగం ఇప్పుడు ఉండటం లేదు. సైన్యం ఘనతను బీజేపీ క్లెయిమ్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూడటం ఎబ్బెట్టుగా మారింది. ప్రజల్లోనూ వ్యతిరేకతకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close