ఖమ్మంలో పొంగులేటికి పొగ పెట్టేసినట్లే !

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలా బయటకు పంపాలా అని టీఆర్ఎస్ కొంత కాలంగా చూస్తోంది. అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగులో శుక్రవారం రాత్రి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఘర్షణ జరిగింది. పొంగులేటి, ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవిలను ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులను పిలవలేదు. అసలు ఈ కార్యక్రమం వద్దని ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెచ్చి నిలుపుదల చేయిచారు.

కానీ పొంగులేటి మాత్రం .. పిడమర్తి రవితో ఆవిష్కరింపచేశారు. దీంతో రేగా, పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై స్పందించిన రేగా కాంతారావు పొంగులేటి టీఆర్ఎస్‌లో లేడని.. మండిపడ్డారు. తాను గులాబీ పార్టీలోనే ఉన్నానని అనుమానాలు ఉంటే పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఎవరికీ బీఫామ్ ఇచ్చినా వారితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అది రేగా అయినా మరోక నేత అయినా ఖచ్చితంగా వారి గెలుపు కోసం కృషిచేస్తానన్నారు.

రేగా కాంతారావు కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. అక్కడ పాయం వెకంటేస్వర్లు అనే టీఆర్ఎస్ నేతను పొంగులేటి ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్‌లో తన అనుచరుల్ని బలంగా ప్రోత్సహిస్తున్నారు పొంగులేటి. ఇప్పుడు ఈ గొడవతో హైకమాండ్‌తో పొంగులేటికి మరింత దూరం పెరగడమే కాదు.. ఆయన పార్టీలో లేరన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close