ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ చర్చలు !

తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. మంత్రులే ఆయనను కలవలేరు. కేసీఆర్ అనుకుంటే తప్ప కలవడం అసాధ్యం. కానీ ప్రకాష్ రాజ్‌కు మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు కేసీఆర్‌తో ఎంట్రీ లభిస్తోంది. తాజాగా ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిన ప్రకాష్ రాజ్ దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. పీకేతో చర్చల్లో ప్రకాష్ రాజ్ కూడా కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించారు. యూపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. జాతీయ రాజకీయాల్లో అందరూ ఏ క తాటిపైకి రావాలంటే ఏం చేయాలి వంటివాటిపై చర్చించారు.

అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలను ఏకం చేసేలా సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ తరపున.. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తరపున తీసుకోవాల్సిన బాధ్యతలపై ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పీకే పూర్తిగా ప్రకాష్ రాజ్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎలాంటి వ్యూహాలు అవలంభించాలన్నదానిపై కేసీఆర్ , ప్రశాంత్ కిషోర్ లు ప్రకాష్ రాజ్ కు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ముఖ్య సమన్వయకర్తగా ప్రకాష్ రాజ్ ఉండటం ఖాయమైపోయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి టీఆర్ఎస్‌లో ఢిల్లీ వ్యవహారాల్ని చక్కబెట్టడానికి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బోయిన్ పల్లి వినోద‌్ కుమార్ వంటి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. కానీ వారినందర్నీ కాదని కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన వద్ద ఏం ఉంది… కేసీఆర్ ఎందుకు ప్రకాష్ రాజ్ పై ఆసక్తి చూపిస్తున్నారనేది టీఆర్ఎస్ నేతలకూ అర్థం కావడం లేదు. కొసమెరుపేమిటంటే.., ఎర్రవల్లిలో భేటీతర్వతా గజ్వేల్ అభివృద్ధిని చూడాలని ప్రకాష్ రాజ్‌, ప్రశాంత్ కిషోర్‌లకు కేసీఆర్ సూచించారు. అంతే అధికారులు దగ్గర ఉండి.. గజ్వేల్ అభివృద్ధిని వారికి చూపించారు. ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ డైరక్ట్‌గా సమావేశమైన విషయం మొదటి సారి ఇప్పుడే బయటపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close