నిత్య‌పై కోపంతోనే ఆ పాట తొల‌గించారా?

భీమ్లా నాయ‌క్ ఆల్బ‌మ్‌లో `అంత‌మిష్ట‌మేంద‌య్యా` పాట‌ సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ఈ పాట సినిమాలో లేదు. లెంగ్త్ స‌మ‌స్య‌ వ‌ల్ల ఈ పాట తీసేశామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈ పాట‌కు అంత స్కోప్ లేద‌ని కూడా అంది. నిజానికి ‘భీమ్లా.. ‘ లెంగ్తీ సినిమా ఏం కాదు. ర‌న్ టైమ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. పాటకూ స్పేస్ ఉంద‌క్క‌డ‌. నిజానికి హిట్ సినిమా పాట‌ల్ని… సినిమాలోంచి తొల‌గించడానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. స్టార్ సినిమాల్లో పాట పెడితే, లెంగ్త్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని ఎవ‌రూ అనుకోరు. పాట ప‌క్క‌న పెట్ట‌డానికి ఏదో ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

అది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాట‌లో ప‌వ‌న్ – నిత్య‌మీన‌న్‌ల‌పై తెర‌కెక్కించారు. చిత్ర‌బృందంలోని ఓ ముఖ్య‌మైన స‌భ్యుడికీ, నిత్య‌కీ మ‌ధ్య చిన్న‌పాటి క్లాష్ వ‌చ్చింద‌ని, నిత్య‌పై కోపాన్ని ఎలా చూపించాలో తెలీక‌…ఆ పాట కత్తిరించార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ‘భీమ్లా నాయ‌క్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో నిత్య క‌నిపించ‌లేదు. స‌క్సెస్ మీట్ కి రాలేదు. ప్ర‌మోష‌న్లు స‌రేస‌రి. ‘భీమ్లా..’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ స‌మ‌యానికి నిత్య హైద‌రాబాద్ లోనే ఉంద‌ని, అయినా స‌రే, రాలేద‌ని మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే నిత్య‌కీ, ఈ టీమ్ లో ఓ కీల‌క‌మైన స‌భ్యుడికీ ఏదో అయ్యే ఉంటుంద‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close