బెల్లంకొండ ‘షాకింగ్‌’ ప్రాజెక్ట్‌|

ఛ‌త్ర‌ప‌తితో హిందీ లో అడుగుపెడుతున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. అది హిందీ సినిమానే అయినా, సౌత్‌లో అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. ఛ‌త్ర‌ప‌తి చూసేసినా, తెలుగులోనూ ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. ఈలోగా బెల్లంకొండ ముందుకు మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్ట్ వ‌చ్చింది. ఈసారి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ని టాక్‌. ఓ అగ్ర ద‌ర్శ‌కుడు ఈసారి ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడి వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో చాలామంది స్టార్ల పేర్లు క‌నిపిస్తాయ‌ని, ఈ కాంబినేష‌నే షాకింగ్ గా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ప్రాజెక్టులో ఎవ‌రెవ‌రు ఉంటారో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. మ‌రోవైపు `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ ప‌నులు శ‌ర వేగంగా సాగిపోతున్నాయి. ఈ సినిమాకి స‌రైన టైటిల్ కోసం చిత్ర‌బృందం ఇంకా అన్వేష‌ణ కొన‌సాగిస్తోంది. `ఛ‌త్ర‌ప‌తి` అనే టైటిల్ నే హిందీలోనూ పెడ‌దామ‌నుకుంటే, ఆ టైటిల్ మ‌రొక‌రు రిజిస్ట‌ర్ చేయించేసుకున్నారు. `ఛ‌త్ర‌ప‌తి శివాజీ`, `శివాజీ` అనే పేర్లుకూడా అందుబాటులో లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close