‘ఎత్త‌ర జెండా..’ సినిమాలో ఉండ‌దా?

ఈరోజు `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి `ఎత్త‌ర జెండా` పాటొచ్చింది. ఆర్‌.ఆర్‌.ఆర్ నుంచి చిన్న పోస్ట‌ర్ వ‌చ్చినా, టీజ‌ర్ వ‌చ్చినా… సోష‌ల్ మీడియాలో అల్ల‌క‌ల్లోలం జ‌రిగిపోతుంది. అలాంటిది.. ఏకంగా వీడియో సాంగే రిలీజ్ చేసేశారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అలియా.. ముగ్గురూ ఆడి, పాడి… అల‌రించారు. `ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి, కొమ్ములు విరిచిన కోడె గిత్త‌ల్లాంటి అమ‌ర వీరుల్ని త‌ల‌చుకుంటూ` అంటూ… రాజ‌మౌళి ఈ పాట‌ని విడుద‌ల చేశారు. ప్రాంతాల‌కు అతీతంగా ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల్ని ఈ పాట‌లో త‌ల‌చుకున్నారు. దేశ భ‌క్తి గీత‌మైనా స‌రే, మాసీ మాసీగా తీర్చిదిద్ద‌డం బాగుంది. ప్రేమ్ ర‌క్షిత్ కూడా.. అభిమానుల్ని అల‌రించేలానే స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. అయితే ఈ పాట‌.. సినిమాలో ఉండ‌ద‌ని టాక్‌. కేవ‌లం ప్ర‌మోష‌న్ కోస‌మే ఈ పాట‌ని వాడుతున్నార‌ని తెలుస్తోంది. `దోస్తీ` అనే పాట‌నికూడా ఇది వ‌ర‌కు చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఆ పాట కూడా.. సినిమాలో ఉండ‌దు. కేవ‌లం ప్ర‌మోష‌న్‌కి మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. ఇప్పుడు.. ఎత్త‌ర జెండా పాట కూడా అంతే. నిజానికి ముందు ఈ పాట తీసే ఆలోచ‌నే లేదు. సినిమా త‌యారీకి, విడుద‌ల‌కు మ‌ధ్య కావ‌ల్సినంత స‌మ‌యం ఉండ‌డంతో.. ఈ పాట‌ని కంపోజ్ చేయించిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close