ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న మార్పులు.. వైసీపీ నేతల్ని కూడా తొందరపడేలా చేస్తున్నాయి. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాలు ఇప్పుడు.. కొంత మందిని టీడీపీలోకి చేర్పించేస్తున్నారు. సైలెంట్‌గా ఈ రాజకీయం నడిచిపోతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుటుంబానికి కురుపాం నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త పరీక్షిత్ రాజు అరకు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి ని టీడీపీలోకి పంపుతున్నారు.
తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా పుష్పశ్రీవాణి భర్త పరీక్షీత్ రాజు సొంత చెల్లలు ప్రకటించారు. దీనికి పరీక్షిత్ రాజు తండ్రి మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప శ్రీవాణి మామ చంద్రశేఖరరాజు కొన్నాళ్ల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పారు.ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కుమార్తెను కూడా టీడీపీలో చేర్పించి.. కురుపాంలో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి ఎదురుగాలి వీచినా … టీడీపీ ద్వారా తమ కుటుంబ పట్టు నిలుపుకుంటున్నట్లుగా ఉంటుదంని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు ఎక్కువగా కనిపిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
వైసీపీలో ముఖ్యనేతలు కొంత మంది ఇప్పటికే ఈ తరహా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కొంతమంది టీడీపీతో టచ్‌లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి దిగజారిపోతోందనే అంచనాకు వచ్చిన ఎక్కువ మంది. .. అదే పని చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత పరిస్థితి మరింత ఎక్కువ అవుతుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.