కేజ్రీవాల్‌కూ తెలంగాణలో చాన్స్ కనిపిస్తోంది !

తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ ఎక్కువగా ఉందని.. అందులో తమ పార్టీని చొప్పించేయాలనుకునే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షర్మిల, ప్రవీణ్ కుమార్ వంటి వారే కాదు.. కొత్తగా పంజాబ్‌లో గెలిచిన ఆమ్ ఆద్మీ కూడా తెలంగాణపై కన్నేసింది. దక్షిణాదిలో పార్టీని విస్తరించుకోడానికి తెలంగాణలో అడుగు పెట్టాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోమనాథ్ భారతి అనే ఆప్ సీనియర్ నేత దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే పలువురు మాజీ బ్యూరో క్రాట్లను కలిసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి ఉంది. ఈ కారణంగా కేజ్రీవాల్ తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి తెలంగాణలో ఆప్ లాంటి పార్టీలకు హైదరాబాద్‌లో మాత్రమే కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అసలు ఆప్ గురించి ఎవరికీ అవగాహన కూడా ఉండదు. పూర్తి స్థాయిలో లోకలైజేషన్ ఉన్న.. స్థానిక నినాదం పాతుకుపోయిన తెలంగాణలో .. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ పెట్టి నఆమ్ ఆద్మీ నిలబడటం దాదాపుగా అసాధ్యమే. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉన్న ఆమ్ ఆద్మీ… ఇక్కడ కొంత పోరాడుతున్న కాంగ్రెస్‌కు ఝులక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రెడీ అవుతున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close