ఆర్కే పలుకు : ఈ వారం స్వయం ఎలివేషన్లు !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం మీడియలో తానే అఖండ అన్నట్లుగా స్వయం ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలనే ఇరుసుగా చేసుకున్నారు. ఇటీవల సీఎం జగన్ .. ఎప్పట్లాగే.. తన ప్రసంగం చివర మీడియా సంస్థలపై విమర్శలు చేశారు. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు అంటూ లిస్ట్ చదివి మారీచులు..ఉన్మాదాలు ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నథింగ్ ని.. తాము వీటితోనే పోరాడతాం అన్నారు. ఆర్కేకు ఇది బాగా నచ్చినట్లుగా ఉంది. తనను.. తన సంస్థను హైలెట్ చేసుకోవడానికి దాదాపుగా ముఫ్పై శాతం ఆర్టికల్ కేటాయించారు.

తమను మారీచుడు అన్న జగనే మారీచుడు అని ఎప్పట్లాగే కథలు కథలుగా చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తాము మాత్రమే ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నట్లుగా జగన్ మాటల్ని ఆసరాగా చేసుకుని గొప్పగా చెప్పుకోవడమే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆర్కేకు .,.ఆంధ్రజ్యోతికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో కానీ.. దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని .. ప్రజల కోసం రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని ఆర్కే తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తమకు రూ. రెండు వందల యాభై కోట్ల విలువైన యాడ్స్ రావాల్సి ఉన్నా.. జగన్ రానివ్వలేదని.. అయినా తగ్గలేదని… చాలా మందితో రాయబారాలు పంపినా తాము పట్టించుకోలేదని… ఇలా చాలా ఎలివేషన్లు క్రియేట్ చేసుకున్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తమను తాము ఓ అఖండలా ప్రొజెక్ట్ చేసుకున్నారు.

ఈ టెంపోను మిగతా ఆర్టికల్ మొత్తం కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి ఎలా అందర్నీ దూరం చేసుకున్నారో వివరించారు. ఆయనను గెలిపించిన అన్ని వర్గాలూ ఇప్పుడు ఆయన ఓటమి కోసం పనిచేయబోతున్నాయని ప్రకటించారు. బ్రదర్ అనిల్ క్రిస్టియన్ పార్టీ పెట్టబోతున్నట్లుగా కూడా తేల్చేశారు. క్రిస్టియన్ పార్టీ పెడితే జగన్ ఓటు బ్యాంక్ చీలిపోతుందని ఆర్కే అంచనా వేశారు. ఇదంతా మీడియా వల్ల కాదు కదా అని జగన్‌కు చాయిస్ ఇచ్చారు.

సోమవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది. ఉదయమే ఈ మీటింగ్ గురించి బయటకు తెలిసింది. ‌ అయినప్పటికీ ఆర్కే ఈ అంశాలపై స్పందించలేదు. కేవలం జగన్‌కే పరిమితం చేశారు. బహుశా.. ఈ సారి కేసీఆర్ ఏం చేయబోతున్నారో.. ఆర్కేకు కూడా సమాచారం లేదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close