ఏపీ కరెంట్ కష్టాలకు ఉక్రెయిన్ యుద్ధమే కారణమా !

ఎక్కడో రష్యా – ఉక్రెయిన్ పోట్లాడుకుంటున్నాయి. కానీ ఇక్కడ వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. రేపోమాపో పెట్రోల్, డీజిల్ రేటు నూటయాభై దాటిపోతుందని చెబుతూ భయపెడుతున్నారు. ఇప్పుడు కరెంట్ కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల సంగతేమో కానీ ఇప్పటికే ఏపీ కరెంట్ కోతలకు ఉక్రెయిన్ యుద్ధమే కారణం అని చెబుతున్నారు. బొగ్గు కొరత విపరీతంగా ఏర్పడింది. సరిపడా నిల్వలు లేవు. బకాయిలు చెల్లించనందున ఏపీ ప్లాంట్లకు బొగ్గు ఇవ్వడం లేదని చెబుతున్నారు కానీ.. నిజానికి బొగ్గు గనుల్లో పేలుళ్లకు వాడే ప్రొపెల్లంట్ పౌడర్‌ కొరత కారణంగా ఉత్పత్తి తగ్గడమేనని చెబుతున్నారు. సింగరేణి సహా పలు బొగ్గు ఉత్పత్తి సంస్థలు ఉక్రెయిన్ నుంచే ప్రొపెల్లంట్ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటాయి.

యుద్ధం వల్ల అవి ఆగిపోయాయి.ఈ కారణం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. కావాల్సినంతగా బొగ్గు ఇవ్వలేమని సింగరేణి సహా బొగ్గు ఉత్పత్తి సంస్థలు తెబుతున్నాయట. దీంతో ఉన్నతాధికారులు హైరానా పడిపోతున్నారు. ఎలా బయటపడాలా అని మేధోమథనం చేస్తున్నారు. బొగ్గు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో కేంద్రం నిర్దేశిస్తోంది. దీంతో ఏపీకి దిగుమతికి మాత్రమే ఆప్షన్ ఉంది. కానీ ధర భరించలేనంతగా ఉంది. ఇప్పటికే ఏపీని కరెంట్ కష్టాలు ముంచెత్తాయి.

ధర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పరిమితంగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల పాటు కూడా రావు. పూర్తి స్థాయిలో బొగ్గు వస్తేనే ఆ పరిస్థితి. మరో వైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బొగ్గు పూర్తి స్థాయిలో అందితేనే కోతలు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ బొగ్గు కొరత అంటూ ఏర్పడితే ఏపీని చీకట్లు అలుముకుంటాయని జనం భయపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎంత పెట్టి కొందామన్నా కరెంట్ దొరకని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. అందుకే కరెంట్ కోతలు హోరెత్తిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close