మీడియా వాచ్‌: సూప‌ర్ స్టార్ ఆరోగ్యంపై ‘ఏబీఎన్’ అత్యుత్సాహం

గోరంత‌ల్ని కొండంత‌లు చేయ‌డం, ఏమీ లేని చోట కూడా మ‌సిపూసి మారేడు కాయ చేయ‌డం టీవీ ఛాన‌ళ్ల‌కు బాగా అల‌వాటైపోయింది. కొన్ని ఛాన‌ళ్లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి – తామే ఫ‌స్ట్ అనిపించుకోవాల‌న్న తొంద‌ర్లో అభాసు పాల‌వుతుంటాయి. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి విష‌యంలో అదే జ‌రిగింది.

గురువారం కృష్ణ కుమార్తె మంజుల ఓ ఫొటో షేర్ చేసింది. అందులో కృష్ణ తో స‌హా ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులున్నారు. అంద‌రూ న‌వ్వుతూనే ఉన్నారు. కానీ ఏబీఎన్ వాళ్ల‌కు మాత్రం కృష్ణ మొహం కొంచెం తేడాగా క‌నిపించింది. దాంతో `కృష్ణ ఆరోగ్యానికి ఏమైంది` అంటూ క‌థ‌నం ప్ర‌సారం చేసింది. కృష్ణ‌కు ఏదో అయిపోయింద‌ని, అందుకే ఆ మొహం తేడాగా ఉంద‌ని, ఈ విష‌యంలో అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని వార్త ప్ర‌సారం చేసింది.

నిజానికి ఆ ఫొటోని కాస్త జూమ్ చేస్తే.. కృష్ణ ఫేస్ మాస్క్ వేసుకున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అది.. దూరం నుంచి చూస్తే కాస్త తేడాగా ఉన్న‌మాట నిజం. కానీ.. నిశితంగా ప‌రిశీలించ‌కుండా ఆరోగ్యం ఏమైపోయిందో అంటూ.. క‌థ‌నాలువండి వారిస్తే ఎలా.? అందులోనూ సూప‌ర్ స్టార్ కృష్ణ విష‌యంలో..? ఈ క‌థ‌నాల‌పై కృష్ణ కుటుంబ స‌భ్యులు కూడా స్పందించారు. “ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయొద్దు“ అని మీడియాని కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close