భ‌వ‌దీయుడులో.. భామ‌ల జోరు!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే.. `భ‌వ‌దీయుడు… భ‌గ‌త్ సింగ్‌`. ఈ సినిమా స్క్రిప్టు ఎప్పుడో లాక్ అయిపోయింది. సెట్స్‌పైకి వెళ్ల‌డ‌మే బాకీ. ఈలోగా న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు సాగుతోంది. ఈ సినిమాలో గ్లామ‌ర్‌కు ఏమాత్రం కొద‌వ లేకుండా హ‌రీష్ శంక‌ర్ జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని టాక్‌. ఓ క‌థానాయిక‌గా పూజా హెగ్డే దాదాపుగా ఫిక్స్‌. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. వాళ్ల కోసం ఇప్పుడు అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఓ హీరోయిన్ పాత్ర‌.. చాలా గ్లామ‌రెస్‌గా ఉండాల‌ట‌. ఆ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ కూడా చేయిస్తార‌ని స‌మాచారం. `గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో కెవ్వు కేక సూప‌ర్ హిట్ అయ్యింది. ప‌వ‌న్ సినిమాల్లోనే ది బెస్ట్ ఐటెమ్ గీత‌మ‌ది. అలాంటి పాట ఈసినిమా కోసం దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేశాడ‌ట‌. ఆ పాటలో ఓ హీరోయిన్ క‌నిపించాల్సిందే. ఇందులో ప‌వ‌న్ ఓ లెక్చ‌ల‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్ని చాలా ఫ్రెష్‌గా ఉండేలా రాసుకున్నాడ‌ట హ‌రీష్‌. త‌న బ‌లం.. రైటింగే. కామెడీ ఎపిసోడ్స్‌, ట్రాకుల‌తో… సినిమాని హాయిగా న‌డిపించేస్తాడు. అలాంటి ఎపిసోడ్లు కాలేజీ సీన్స్‌లో బాగానే ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close