ఆర్కే పలుకు : పథకాల్ని ఆపేయబోతున్న జగన్!

మొత్తంగా అమ్మడానికి.. తాకట్టు పెట్టడానికి చివరికి అప్పులు పుట్టించడం కూడా సాధ్యం కాని స్థితికి ఏపీని మూడేళ్లకే తీసుకెళ్లిన జగన్ ఇప్పుడు పథకాల్ని ఆపే సి ఆ నెపాన్ని విపక్షాలపై వేయాలనుకుంటున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తేల్చారు. తన వారాంతపు ఆర్టికల్‌ ” కొత్తపలుకు”లో ప్రధానంగా జగన్ చేసిన పథకాలు ఆపేయమంటున్నారన్న విమర్శలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిచారు. మొత్తంగా నలుగురి పేర్లు అందలో తన పేరు కూడా చేర్చి దుష్ట చతుష్టయం అంటున్నారని .. ఆ చతుష్టయంలో ఆర్బీఐ, కాగ్ వంటి వారు కూడా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఆర్కే.. తన మార్క్ సెన్సాఫ్ హ్యూమర్‌ను కూడా ప్రదర్శించి. దుష్ట చదుష్టయానికి జగన్ భాషలో ” దుసట చతుసటయం” అని కూడా వివరించారు.

ఆస్తులు, ఆదాయం పెంచకుండా అప్పులు చేసుకుంూ పోతే శ్రీలంక అవుతుందని తాము చెప్పడం లేదని.. ఆర్థిక నిపుణులందరూ చెబుతున్నారని ఆర్కే స్పష్టం చేశారు. కానీ పథకాల్ని ఇచ్చే శక్తి లేని జగన్ ిప్పుడు తమపై నిందలేసి పథకాల్ని ఆపేయబోతున్నారని ఆర్కే జోస్యం చెప్పారు. ఎందుకు పథకాలు ఆగబోతున్నాయో కూడా వివరించారు. కేంద్రం కూడా ఏపీకి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుందట . ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించి… ఏపీ అప్పుల విషయంలో ఖచ్చితంగా రూల్స్ పాటించాలని ఆదేశించాట. అందుకే ఇప్పుడు అప్పులకు ఇంకా అనుమతి రాలేదని చెబుతున్నారు.

ఆర్కే తన ఆర్టికల్‌లో చాలా సూటిగా ఒకటే సందేశాన్ని ఇస్తున్నారు. జగన్ పాలన వల్ల ఇక ఏపీ కోలుకునే పరిస్థితి ఉండదని.. ప్రజలు పన్నులు కట్టుకుంటే అందులో కొంత పాలకులు దిగమింగి మరికొంత మంది ప్రజలకు పంచుతారనిచెబుతున్నారు. ఏపీలో ఇప్పుడు కాంట్రాక్టుల అవినీతి తగ్గిపోయిందని తేల్చారు. ఆ అవినీతి తగ్గిపోవడానికి కారణం టెండర్లు వేసేవారు ఎవరూ లేకపోవడమే. పనులు జరగడం లేదు… బిల్లులు వస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి టెండర్లు వేయడం లేదంటున్నారు. అదే తెలంగాణలో ఎనిమిది శాతం.. కర్ణాటకలో పద్దెనిమిది శాతం కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో కాంట్రాక్ట్ కమిషన్లు లేకపోవడం వల్ల సహజ వనరుల దోచుకుంటున్నారని ఆర్కే తేల్చారు.

ఈ వారం మొత్తం ఆర్టికల్‌ను చదివిన తర్వాత ఆర్కే కలిగించే అభిప్రాయం. జగన్ కు కూడా తన భవిష్యత్ అర్థమైపోయింది. మూడేళ్లకే చేతులెత్తేశాడు. అందుకే భయంగా బేలగా.. మాట్లాడుతున్నాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు దిగే ప్రయత్నం చేస్తున్నారు అని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close