చైతన్య : పక్క రాష్ట్రంలో జరిగితే ఆవేశం.. సొంత రాష్ట్రంలో జరిగితే నిర్లక్ష్యం !

ఏపీలో అమ్మాయిలపై.. మహిళలపై ఆకృత్యాలు ఎందుకు పెరిగిపోతున్నాయి ? . తాను పదవి చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో “బైక్ టోల్ కట్టేందుకు వెళ్లిన అమ్మాయి”ని దుండగులు అత్యాచారం చేసి చంపేశారని మనసు చలించిపోయి.. ఏపీలో అలాంటివి జరగకూడదని ఆవేశ పడి మూడు వారాల్లో ఉరిశిక్ష వేసేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చారు జగన్. కానీ అక్కడ కంటే ఏపీలో ఇప్పుడు ఘోరాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఏ దిశ వారిని ఆదుకోవడం లేదు. మీడియాలో హైలెట్ అయిన వారికి పదో .. పరకో పరిహారం ఇస్తున్నారు. అంతకు మించి రాజకీయం చేస్తున్నారు. అంతే.. బాధితులు మాత్రం బాధితులుగానే ఉండిపోతున్నారు. వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

నేరాలు జరగనిది ఎక్కడ ?

అనంతపురంలో ఓ బ్యాంక్ లో పని చేసుకుంటున్న అమ్మాయిని చంపేసి కాల్చేశారు. ఆ నిందితులేమయ్యారు…? గుంటూరులో చిన్నారిని.. ఓ యువతిని.. ఇలా దారుణంగా హత్యలు చేశారు.? వారేమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్లోనూ ఈ మూడేళ్లలో దురాగతాలు బయటపడ్డాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థ విఫలం కావడంతో ఎవరికీ శిక్షలు పడటం లేదు. నిందితుల్ని కులం, మతం, ప్రాంతం కోణంలో చూడటంతోనే అసలు సమస్య వస్తోంది. అలా చూసే పాలకులు ఉండటంతో బాధితులు కూడా బాధితులుగానే మిగిలిపోతున్నారు.

నేరస్తులకు అభయం కల్పిస్తున్న పాలన !

భయం.. భయం .. ఉంటే ఎవరైనా నేరం జరగడానికి భయపడతారని సీఎం జగన్ చెప్పారు. ఆ భయం కల్పించకపోగా అభయం కల్పించినట్లుగా ఉన్నారు ఏపీ పాలకులు. అందుకే నేరస్తులు చెలరేగిపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, మానవ మృగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు ప్రచారం చేసుకోవడంతోనే సమస్య వస్తోంది. బాధితులకు వేధింపులు.. నేరస్తులకు అభయం కల్పిస్తోంది ఈపాలన.

ప్రచారానికి మాత్రం హద్దే లేదు !

దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు, దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకటనలకు కోట్లు ఖర్చు పెట్టారు. దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరి వేశామని అప్పటి హోంమంత్రి ప్రకటించి నవ్వులపాలయ్యారు. అసలు ఆ చట్టానికే కేంద్రం ఆమోదం లభించలేదు. ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలే లేవు. దిశ చట్టం ఇంత వరకూ కేంద్రం ఆమోదం పొందలేదు. కానీ దిశ పేరుతో పోలీస్టేషన్లు పెట్టారు. యాప్ తెచ్చి మీట నొక్కితే.. పోలీసులు ఎక్కడ అమ్మాయి ఆపదలో ఉందో గుర్తించి అక్కడికి చేరుకుంటారని ప్రచారం చేశారు. కానీ అంతా ప్రచారానికే పరిమితమైంది. చివరికి ప్రజలు బలవుతున్నారు.

పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగినప్పుడు ఆవేశపడిన వైనం చూసి.. అహా.. ఓహో అనుకున్నారు. కానీ అసలు పాలన చూసి భయపడాల్సిన పరిస్థితి. చిత్తశుద్ధి లేకుండా ఏం చేసినా అంతే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close