వైసీపీ నేతలు ఆహ్వానించారు – టీడీపీ వాళ్లు తీసుకొస్తున్నారు !

నాలుగు కాదు నాలుగు వందల బస్సుల్లో రండి ఏపీలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని ఏపీ మంత్రులు కేటీఆర్‌కు సవాల్ చేశారు. అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ నుంచే కాదు అన్ని పొరుగు రాష్ట్రాల నుంచి ఇంకా కావాలంటే.. ఆ పొరుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నేతల్ని.. ప్రముఖుల్ని తీసుకొచ్చి ఏపీని చూపించాలని నిర్ణయించారు. అయితే ఇలా నిర్ణయించింది వైసీపీ నేతలు కాదు టీడీపీ నేతలు. ఏపీలో పరిస్థితుల్ని.. పాలనను చూడాలంటే టీడీపీ పొరుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని ఆహ్వానిస్తోంది. బుద్దా వెంకన్న బహిరంగా ఆహ్వానం పలికారు కూడా.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేని టీడీపీ చెబుతోంది. కావాలంటే తాము దగ్గరుండి చూపిస్తామని అంటోంది. ఈ విషయంలో ఒక్క టీడీపీనే కాదు సీపీఐ నారాయణ కూడా అదే మాట అనడం కాదు.. ఆయన నేరుగా వీడియో తీసి చూపించారు కూడా. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని .. పాలనా వైఫల్యాన్ని .. ఇతర ప్రభుత్వ విధానాల్లోని లోపాలను మరింత ప్రభావవంతంగా బయట పెట్టాలని వైసీపీ నేతలు ఇచ్చిన ఆహ్వానాన్నే ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పొరుగు రాష్ట్రాల నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అలాంటి వారిని ఏపీకి తీసుకొచ్చి చర్చ పెట్టడమో.. మరో రకంగా సమస్యల్ని హైలెట్ చేయడమో పెద్ద విషయం కాదు. ఈ దిశగా కూడా టీడీపీ ఆలోచన చేస్తోందని.. బుద్దా వెంకన్న ప్రకటనతోనే తేలిపోయింది. టీడీపీ ఈ వ్యూహం పాటిస్తే రాజకీయంగా వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్లే వచ్చి చూడాలని సవాల్ చేశారు కాబట్టి… టీడీపీ వాళ్లు తీసుకొచ్చి చూపించాలని డిసైడయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close