తెలంగాణ “అవినీతి” పై ప్లాన్డ్‌గా గురి పెడుతున్న బీజేపీ !

తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ కమిటీలు, దర్యాప్తు అధికారుల్ని నియమిస్తోంది. ఆ అధికారం ఉందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ భారీగా అవినీతి జరిగిందని అనుమానం చోట్ల విచారణకు ఇప్పటి వరకూ అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని ఏదో విధంగా తొలగించుకుని విచారణ దారులు సృష్టించుకుంటోంది కేంద్రం. అందులో భాగంగానే తాజాగా మిషన్ భగీరథ అంశంలో అవినీతి జరిగిందని నిర్ధారించుకోవడం. ఇప్పటికే ధాన్యం అవకతవకల్లో ఎఫ్‌సీఐ విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా అవినీతి జరిగిందని ఇప్పటికే తేల్చారు. ఇక తర్వాత ప్రాజెక్టుల మీదకు రావొచ్చు. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి.

మిషన్ భగీరథ అయినా ప్రాజెక్టుల్లో అవినీతి అయినా.. ధాన్యం అవకతవకలైనా విచారణ జరిపే అధికారం కేంద్రానికి లేదు. మిషన్ భగీరథ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఖర్చు. కేంద్ర నిధులు ఉంటే విచారణ చేయించడానికి అవకాశం ఉండేది.కేసీఆర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాళేశ్వరం లాంటిప్రాజెక్టు కూడా అంతే . కేంద్రం రూపాయి ఇవ్వలేదు. నిజానికి ఈ రెండింటికి ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.కానీ పైసా ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చి ఉంటే.. తాము ఇచ్చిన నిధులు అవినీతి పాలయ్యాయని సీబీఐ విచారణ జరిపించేవారేమో. ధాన్యం సేకరణ అయినా అంతే. ఎఫ్‌సీఐకి చర్యలు తీసుకునే అధికారం లేదు.

అయినా ఇప్పుడు వివిధ మార్గాల ద్వారా విచారణ అవకాశాల్ని బీజేపీ సృష్టించుకుంటోంది. బక్కా జడ్సన్ అనే వ్యక్తి లేఖ రాశారని మిషన్ భగీరధపై విచారణాధికారిని నియమించింది. ప్రాజెక్టుల్లో అవినీతిని కాంట్రాక్ట్ సంస్థలపై ఐటీ దాడుల ద్వారా బయటకు తీయడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది. దాన్యం అవకతవకలపై సీబీఐ విచారణకూ మార్గం సుగమం చేసుకుంది. ఇక కేసీఆర్‌ను ఎప్పుడు కార్నర్ చేయాలంటే అప్పుడు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. దానికోసమే గ్రౌండ్ పిపరేషన్లని తెలంగాణ రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close