రామ్ సినిమాకి రూ.75 కోట్లా?

రామ్ మార్కెట్ నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 20 – 25 కోట్ల లోపే. ఇస్మార్ట్ శంక‌ర్ రూ.50 కోట్లు వ‌సూలు చేయ‌డంతో… రామ్ పై న‌మ్మ‌కాలు పెరిగిపోయాయి. కానీ ఎంత పెరిగినా, బ‌డ్జెట్ రూ.50 కోట్ల‌కు కాస్త అటూ ఇటూ ఉండేలా చూసుకోవాలి. కానీ.. రామ్ కొత్త సినిమా బ‌డ్జెట్ బోర్డ‌ర్లు దాటేసింది.

రామ్ – లింగుస్వామి కాంబినేష‌న్‌లో `ది వారియ‌ర్‌` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ 70 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. ఇంకొంచెం షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మిగిలివుంది. ప‌బ్లిసిటీ కూడా క‌లుపుకుంటే మ‌రో 5 కోట్లు తేలుతుంది. అంటే రూ.75 కోట్ల‌న్న‌మాట‌. రామ్ కెరీర్‌లో పెద్ద బ‌డ్జెట్ సినిమా ఇదే. అంత వ‌ర‌కూ ఓకే. కానీ రాబ‌ట్టుకోవ‌డం ఎలా? థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో రామ్ సినిమాకి 35 కోట్లు వ‌స్తే గొప్పే. శాటిలైట్‌, డిజిట‌ల్ మ‌రో 20 కోట్లు వేసుకున్నా.. 55 ద‌గ్గ‌ర ఆగిపోతుంది. కాక‌పోతే.. త‌మిళంలో కూడా ఈ సినిమాని స్ట్ర‌యిట్ గా విడుద‌ల చేస్తున్నారు. అక్క‌డ మార్కెట్ రామ్ కి ఎంత ప్ల‌స్ అవుతుంది? అన్న‌దానిపై రిక‌వ‌రీ ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రో విశేషం ఏమిటంటే.. రామ్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఆ సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్ల‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close