ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డి !

ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడ శైలజానాథ్ పదవి కాలం ముగియడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని నిర్మయించారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్ లకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కనిపిస్తున్నారు. ఆయనను ఢిల్లీ పిలిపించారు. ఆయనతో మాట్లాడి అధికారంగా టీ పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రఘువీరా.. ఆ తర్వాత శైలజానాథ్ పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ మీట్లు తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.

కొత్త పీసీసీ చీఫ్‌గా ఓ రేంజ్ ఉన్న నేతను పెడితే… కాస్త హైప్ వస్తుందని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. ఫెయిలయి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న టాల్ లీడర్. ఆయనను పెడితే ఎలా ఉంటుందా.. అని మేథోమథనం చేస్తోంది హైకమాండ్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పోస్ట్ తీసుకోవాలా వద్దా అన్నదానిపై కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది . కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.

ఢిల్లీ స్థాయిలో పార్టీకి తెర వెనుక సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనను పీసీసీ చీఫ్‌గా పంపితే.. కదలిక వస్తుందని.. పార్టీ క్యాడర్ కొంత మరే వైసీపీ నుంచి వెనక్కి వస్తుందన్న అంచనాలో హైకమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన అంగీకరిస్తే.. ఏపీసీసీకి కూడా కాస్త యాక్టివ్‌గా ఉండేనేత దొరుకుతారు. కష్టపడితే బలపడే అవకాశం కూడా ఉంటుంది. కిరణ అంగీకరిస్తే ఏపీకి ఇక పీసీసీ చీఫ్‌గా ఆయనే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close