వైసీపీ ఎమ్మెల్సీపై హత్య ఆరోపణలు – కానీ పోలీసులకే డౌట్ రావడం లేదు !

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కొద్ది రోజుల క్రితం వరకూ తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యం అనే యువకుడ్ని తీసుకెళ్లారు. తెల్లవారుజామున చనిపోయాడని తన కారులోనే తెచ్చి ఇంట్లో వాళ్లకు అప్పజెప్పి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారు అడ్డుకోవడంతో తన కారు కూడా అక్కడే వదిలేసి వేరే దాంట్లో పరారయ్యారు. సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు ? కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా డెడ్ బాడీని ఇంటికి ఎందుకు తెచ్చారు ? ఎందుకు పరారవ్వాల్సి వచ్చింది ? అసలీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఎవరు?

అప్పు సెటిల్మెంట్ కోసం తీసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ !

సుబ్రహ్మణ్యం అనే యువకుడు డ్రైవర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ఓ ముఫ్పై వేలు అప్పు తీసుకున్నారు. అది చెల్లించలేదు. ఆ కారణంగా అతడితో సెటిల్మెంట్ కోసం ఇంటికి వచ్చి మరీ ఎమ్మెల్సీ తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే పుట్టిన రోజు పార్టీకని తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు. పార్టీకి వెళ్తే ఎందుకు చనిపోయారు..? ఎలా చనిపోయారు..? ఎందుకు సీక్రెట్‌గా తెల్లవారుజామున తీసుకొచ్చారు.. ఇవన్నీ డౌట్సే.

యాక్సిడెంట్ అయితే ఆస్పత్రికి తీసుకెళ్లరా ?

యాక్సిడెంట్ అయిందని చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినట్లుగా సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు చెబుతున్నారు. నిజానికి యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఏం చేస్తారు.. బుర్ర ఉన్న వాడయినా.. లేకపోయినా ముందుగా ఆస్పత్రి తీసుకెళ్తారు. చనిపోయారో లేదో …ఇంకా బతికి ఉంటే ట్రీట్ మెంట్ చేయాలో లేదో డాక్టర్లు చెబుతారు.కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీనే చచ్చిపోయాడని డిసైడ్ చేసి.. సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించి వెళ్లాలనుకున్నారు.

కాళ్లు చేతులు ఎలా విరిగిపోయాయి ?

సుబ్రహ్మణ్యం కాళ్లు చేతులు విరిగిపోయాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాళ్లు చేతులు విరిచేసి కొట్టి చంపారని అంటున్నారు. ఈ విషయంలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా పోలీసులు మాత్రం ఇంత వరకూ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

ఇంత పక్కాగా ఉన్నా.. ఎమ్మెల్సీపై పోలీసులకు డౌటే రావట్లేదు !

క్రైమ్ సినిమాలు చూడాల్సిన పని లేదు… మామూలుగానే సుబ్రహ్మణ్యం అనే యువకుడ్ని దారుణంగా హత్య చేశారని అర్థమైపోతుంది. ప్రాణాలతో తీసుకెళ్లి.. మృతదేహంతో తీసుకొచ్చింది ఎమ్మెల్సీ అనంతబాబు. అతనిపై పోలీసులు ఇంత వరకూ కనీసం కేసు నమోదు చేయలేదు.

అనంతబాబు.. పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో రౌడిషీటర్‌గా పేరున్న వ్యక్తి. చిన్నతనం నుంచే అసాంఘిక కార్యకలాపాలు.. దాడులు, దౌర్జన్యాలతో పేరు తెచ్చుకున్న వ్యక్తి. వైసీపీలో రాజకీయంగా ఎదిగారు. ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ సీటిచ్చారు. ఆయనకు గతంలోనే ఎమ్మెల్సీ సీటిచ్చారు.కానీ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టడంతో నామినేషన్ రిజెక్ట్ అయింది. హత్యలు చేసినా వైసీపీ నేతలకు ఏమీ కాదనే ధైర్యం ఉండబట్టే ఇలా దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close