ఇంకా దివ్యవాణి టీడీపీలోనే ఉంటారా !?

తెలుగుదేశం పార్టీలో దివ్యవాణి వ్యవహారం కొద్ది సేపు కలకలం రేపింది. మహానాడులో తనకు అవమానం జరిగిందని.. తన శవంతో కూడా రాజకీయాలు చేసేవాళ్లేమో అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వీడియో సర్క్యూలేట్ అయిన తర్వాత మంగళవారం ఉదయం.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. కాసేపటికే ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అదే ట్వీట్ స్క్రీన్ షాట్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. టీడీపీలో ఉన్న దుష్టశక్తుల కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు.

అయితే ఏమైందో తెలియదు కానీ.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తాను చేసిన ట్వీట్‌ను.. సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని కొంత మందికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దివ్యవాణి నిర్ణయంపై పార్టీలో కొంత మంది ముఖ్యులు స్పందించి ఆమెతో మాట్లాడటంతోనే ఆమె నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మహానాడులోనూ దివ్యవాణి పాల్గొన్నారు. తొలి రోజు యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. తాను దేవుని బిడ్డనని.. అవసరం అయితే వైఎస్ఆర్‌సీపీలో చేరుతానని కూడా చెప్పడంతో అంతా ఆ పార్టీతో మాట్లాడుకునే … వీడియోలు రిలీజ్ చేస్తున్నారని అనుకున్నారు. తన నిర్ణయంపై నిలబడకపోవడంతో దివ్యవాణి రాజకీయంగా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close