ఇప్పుడైనా క‌త్తిరిస్తారా సుంద‌రం..?!

నాని – అంటే సుంద‌రానికీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా గురించి పాజిటీవ్ గా మాట్లాడుకోవ‌డానికి చాలా అంశాలున్నాయి. నెగిటీవ్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది నిడివి మాత్ర‌మే. దాదాపు 3 గంట‌ల సినిమా ఇది. ఈ రోజుల్లో 3 గంట‌లంటే.. సుదీర్ఘ ప్ర‌యాణ‌మే అని చెప్పాలి. ఎంత పెద్ద స్టార్లున్నా, వాళ్లెంత అద్భుతంగా చేసేస్తున్నా, ప్ర‌తీ సీనులోనూ కంటెంట్ నింపేసినా 3 గంట‌లు చూడ‌డం చాలా క‌ష్టం. విడుద‌ల‌కు ముందు కూడా చిత్ర‌బృందంలో నిడివి గురించిన డిస్క‌ర్షన్ బాగా న‌చ్చింది. సినిమా నిడివి పెరిగింద‌ని, కాస్తో కూస్తో క‌త్తిరించాల‌ని కొంద‌రు, అలా క‌త్తిరిస్తే ఎమోష‌న్ మిస్స‌యిపోతుంద‌ని కొంద‌రు వాదించుకొన్నారు. చివ‌రికి క‌త్తెర వేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యం తీసుకొన్నారు. అలా మూడు గంట‌ల సినిమా… విడుద‌ల చేసేశారు.

ఇప్పుడు అంద‌రినోటా ఒక‌టే మాట‌. అదే.. ర‌న్ టైమ్ పెరిగింద‌ని. `సినిమా అంతా బాగానే ఉంది.. కాస్త క‌ట్ చేస్తే ఇంకాస్త స్పీడుగా ఉండేది..` అని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. క‌నీసం 20 నిమిషాల ర‌న్ టైమ్ త‌గ్గిస్తే బాగుంటుంద‌ని ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు టాక్‌. ఎక్క‌డెక్క‌డ క‌త్తెర్లు వేయాలి? అనే విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. నాని కూడా `త‌గ్గిస్తే బెట‌ర్‌` అనే స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ఈరోజు ఈ విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close