సురేష్‌బాబు అంచ‌నానే నిజ‌మైంది

పెట్టుబ‌డి – మార్కెటింగ్ విష‌యాల్లో సురేష్ బాబు బుర్రే బుర్ర‌. ఏ సినిమా ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎందుకు ఆడుతుంది? అనే విష‌యాల్లో సురేష్ బాబుకి చాలా స్ప‌ష్ట‌త ఉంటుంది. త‌న కొడుకు సినిమా అయినా స‌రే, సెంటిమెంట్ ల‌కు లొంగ‌డు. ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంతే పెడ‌తాడు. రూపాయి న‌ష్టం వ‌స్తుందనుకొన్నా, ఆ ప్రాజెక్ట్‌ని వదులుకోవ‌డంలో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌డు. విరాట‌ప‌ర్వం విడుద‌ల ఆలస్య‌మ‌వ్వ‌డానికి కార‌ణం… సురేష్ బాబు ఆలోచ‌నా స‌రళే. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. కానీ.. విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. దానికి కార‌ణం సురేష్ బాబు. ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌న్న‌ది సురేష్ బాబు ఆలోచ‌న‌. ”ఈ త‌ర‌హా సినిమాలు చూసిన‌వాళ్లంతా మెచ్చుకుంటారు. కానీ చూడ్డానికే జ‌నం థియేట‌ర్ల‌కు రారు. అలాంట‌ప్పుడు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం వ‌ల్ల న‌ష్టం త‌ప్పితే, లాభం ఉండ‌దు..” అని ముందు నుంచీ సురేష్ బాబు చెబుతూనే ఉన్నాడు. త‌నే నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ మంచి ఆఫ‌ర్ తీసుకొచ్చాడు. దాదాపు 40 కోట్ల‌కు సినిమా బేరం పెట్టాడు. కానీ… రానా మాత్రం ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేద్దాం.. అని ప‌ట్టుబ‌ట్టి కూర్చున్నాడ‌ట‌.

ఈ సినిమాకి సురేష్ బాబు సింగిల్ ప్రొడ్యూస‌ర్ కాదు. మ‌రో నిర్మాత కూడా ఉన్నాడు. త‌న‌దీ.. ఇదే మాట‌. ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేద్దామ‌నే స‌రికి, సురేష్ బాబు మాట చెల్లుబాటు కాలేదు. కాక‌పోతే… విడుద‌ల‌కు ముందు రోజు వ‌ర‌కూ ‘ఇది ప‌క్కా ఓటీటీ సినిమా’ అంటూనే ఉన్నాడ‌ట‌. ఇప్పుడు త‌న మాటే నిజ‌మైంది. టాక్ బాగుంది కానీ, అది వ‌సూళ్ల‌లో క‌నిపించ‌డం లేదు. థియేట‌ర్ లో విడుద‌లై… ఆ త‌ర‌వాత ఓటీటీకి వెళ్తోంది కాబ‌ట్టి.. ఇప్పుడు ఓటీటీకి రేటు స‌గానికి స‌గం ప‌డిపోయింది. అదే… నేరుగా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేసి ఉంటే, విరాట‌ప‌ర్వం ఈపాటికి లాభాల్లో ఉండేది. ఈ విషయంలో సురేష్ బాబు అంచ‌నానే నిజ‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close