నితిన్‌పై మండిప‌డ్డ డాన్స్ మాస్ట‌ర్‌

టాలీవుడ్ లోని బెస్ట్ డాన్స‌ర్లలో నితిన్ ఒక‌డు. అలాంటిది నితిన్ కి డాన్స్ రాద‌ని ఓ డాన్స్ మాస్ట‌ర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయ‌నెవ‌రో కాదు.. అమ్మ‌రాజ‌శేఖ‌ర్‌. ”నితిన్‌కి డాన్స్ రాదు. వాడికి డాన్స్ నేర్పించిన మాస్ట‌ర్‌ని నేను. అలాంటిది న‌న్నే మ‌ర్చిపోయాడు.. న‌న్ను చాలా నిరుత్సాహానికి గురి చేశాడు..” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అమ్మ రాజ‌శేఖ‌ర్‌. నితిన్ పై తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డాడాయ‌న‌. ఓర‌కంగా శాప‌నార్థాలు కూడా పెట్టాడు.

విష‌యం ఏమిటంటే… అమ్మ రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌గా, హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కింది. దానికి సంబంధించిన ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నితిన్ ని ఆహ్వానించాడు అమ్మ‌రాజ‌శేఖ‌ర్‌. కానీ నితిన్ వ‌స్తాన‌ని చివ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. దాంతో అమ్మ రాజ‌శేఖ‌ర్‌కి కోపం వ‌చ్చింది. స్టేజీపై నితిన్ పై రుస‌రుస‌లాడేశాడు. ”నితిన్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఏవీ చేయించాను. త‌ను వ‌స్తాన‌ని రాలేదు. రాక‌పోవ‌డానికి కూడా కార‌ణాల్లేవు. త‌న‌కు షూటింగ్ లేదు. ఇంట్లోనే ఉన్నాడు. జ్వ‌ర‌మ‌ని అబ‌ద్ధం చెప్పాడు. నితిన్‌కి డాన్స్ రాదు. నేను వాడికి నేర్పాను. అలాంటి గురువుని మ‌ర్చిపోతాడా. అమ్మ‌నీ, గురువునీ మ‌ర్చిపోయిన వాళ్లు బాగుప‌డ‌రు. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్స్‌ని ఫ్రూట్స్ అనుకొంటారు. తినేసి అవత‌ల ప‌డేస్తారు.కానీ… వాటి విత్త‌నాలు మ‌ళ్లీ మొలకెత్తుతాయి. మ‌ళ్లీ పండ్లే కాస్తాయి. నితిన్‌… మ‌నం మ‌ళ్లీ క‌లుద్దాం..” అంటూ త‌న కోపాన్నంతా చూపించేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close