రాష్ట్రాలు దివాలా తీస్తే అసలు తప్పు కేంద్రానిదే !

అపరిమితంగా అప్పులు చేసి దివాలా దిశగా కొన్ని రాష్ట్రాలు వెళ్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ రాష్ట్రాలను నియంత్రించాల్సింది కేంద్రమే. ఎందుకంటే రాష్ట్రాల అప్పులు పూర్తిగా కేంద్ర అనుమతుల మీదనే ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. అయినా కేంద్రం చూసీ చూడనట్లుగానే ఉంటోంది.

ప్రధాని మోదీ సైతం ఓట్ల కోసం ప్రజలకు ఉచిత పథకాలు పంపిణీ చేయడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. అప్పులు కుప్పలు కుప్పలుగా చేసి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్న రాష్ట్రాలు కళ్లముందు కనిపిస్తున్నా ప్రధాని మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రధాని మోదీ అభిప్రాయం వందకు వంద శాతం నిజమే. ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులకూ విలువ ఉండదు..రాదు. అాలంటి దేశాలు ఏమైపోయాయో శ్రీలంక చెబుతుంది. మరి ఎందుకు కేంద్రం నియంత్రించలేకపోతోంది

మౌలిక సదుపాయాల కోసం ప్రజాధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా అప్పులు చేస్తూ సంక్షేమం పేరుతో ప్రజలకు పంచే రాజకీయ వ్యూహాలే ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడి వ్యయం చేయడాన్ని అనవసరంగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నారు.

రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే… ఆ తప్పులో సింహ భాగం వాటా కేంద్రానికే దక్కుతుంది. ఇప్పుడు శ్రీలంకలో అలా జరిగిందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సుద్దులు చెప్పినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దిగజారిపోయింది. పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి.. కేంద్రమే బాద్యత తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత తాము ముందే హెచ్చరించామంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నష్టపోయేది దేశం. అందుకే రాష్ట్రాలు దివాలా తీస్తే అది దేశానికి నష్టం.. ఆ పాపం కేంద్రానిదే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close