ఆ వీడియో నిజమైతే ఎంపీ గోరంట్లపై చర్యలు : సజ్జల

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో నిజం అయితే ఆయనకు గుణపాఠం కలిగేలా చర్యలు తీసుకుంటామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ వీడియో వివాదంపై ఆయన సీఎంతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మార్ఫింగ్‌దని గోరంట్ల చెబుతున్నారని.. ఈ అంశంపై విచారణ జరుగుతోందన్నారు. మహిళా పక్షపాత పార్టీ గా ఇలాంటి చర్యలను తమ పార్టీ సహించబోదన్నారు.

ఉదయం నుంచి సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపీపై విరుచుకుపడ్డారు. అనేక రకాల మీమ్స్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే తాను జిమ్ చేస్తున్న వీడియోను మార్పింగ్ చేశారని గోరంట్ల మాధవ్ వాదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్‌తో పాటు మరో ఇద్దరు కుట్ర చేశారని తాను ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. చట్టపరంగా ఈ వీడియోలో కేసులు పెట్టేంత ఏమీ లేకపోయినా నైతిక పరంగా వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే నిజమో కాదో తేల్చి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే.. ఇటీవల బయటపడిన మరో రెండు ఆడియోల గురించి ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తాయి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. తమ వి కాదని అప్పట్లో వారువాదించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత పార్టీ ముఖ్య నేతలు ఫిర్యాదు చేసిన పోలీసులు నిజాలు తేల్చలేదు. దీంతో అవి నిజమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. మరి వారిపైనా చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close