పవన్‌కు కేటీఆర్ చాలెంజ్.. చంద్రబాబుకు పవన్ సవాల్ !

రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు కామనే కానీ.. ఒక్కో సారి ఇవి రాజకీయానికి సంబంధించి అయి ఉండవు. సోషల్ కాజ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వినిపించే చాలెంజ్‌లు అలాంటివే. తాజాగా చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని చాలెంజ్ చేశారు. తన చాలెంజ్‌కు ముగ్గుర్ని నామినేట్ చేశారు. అందులో ఒకరు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కూడా వెంటనే.. కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించి చేనేత దుస్తులు ధరించి ఫోటోలు పోస్ట్ చేశారు.

తాను కూడా ముగ్గురికి చాలెంజ్ చేశారు. అందులో ఒకరు చంద్రబాబునాయుడు. ఆయనతో పాటు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. తెలంగాణ బీజేపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఇద్దరు. ఈ ముగ్గురూ స్పందిస్తారో లేదో క్లారిటీ లేదు. అయితే పవన్ కల్యాణ్‌ .. చంద్రబాబుకు చాలెంజ్ చేయడం కాస్త ఆసక్తి కరమే. చంద్రబాబు ధరించే దుస్తులు సహజంగా చేనేతవే అయి ఉంటాయి. రాజకీయ నాయకులు ఎక్కువగా చేనేత దుస్తులే వాడతారు.

తాను ధరించేవి చేనేతే అని చంద్రబాబు పవన్ సవాల్ స్వీకరిస్తారో లేదో తెలియదు కానీ.. అలా స్పందిస్తే మాత్రం .. రాజకీయంగా కుచ్ కుచ్ హోదా హై అనే చర్చలు మాత్రం ప్రారంభమవుతాయి. ఈ రాజకీయాల సంగతేమైనా కానీ ఇలా చేనేతలకు ఆదరణ లభిస్తే.. అ వర్గానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఈ చాలెంజ్‌ను రాజకీయ దృష్టితో చూడకుండా.. సామాజిక దృష్టితో చూస్తే.. ఫీల్ గుడ్ భావన వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close