“సాలు దొర” ను చాలించమన్న ఈసీ!

సాలు దొర – సెలవు దొర అంటూ కేసీఆర్‌ పాలనపై ప్రచారానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న తెలంగాణ బీజేపీకి ఈసీ షాక్ ఇచ్చింది. అది రాజకీయ నేతలను కించ పరిచే విధంగా ఉందని.. ఆ ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ప్రచారాలు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. మీడియా కమిటీ వద్ద ఇందు కోసం తెలంగాణ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. లు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది.

రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈసీ నిర్ణయం బీజేపీకి ఇబ్బందికరమే. ఎందుకంటే ఈ క్యాంపెన్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఒక్క స్లోగన్‌తో కేసీఆర్‌ను దొరగా ప్రోజెక్ట్ చేయవచ్చని అనుకున్నారు. ఈ మేరకు కౌంట్ డౌన్ బోర్డును కూడా తెలంగాణ బీజేపీ ఆఫీసు ముందు పెట్టారు. ఈ అంశం కూడా దుమారంరేగింది. టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.

అయినప్పటికీ.. బీజేపీ ఈ ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నకిల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.టైటిల్‌ను మార్చి ఆ క్యాంపెన్‌ను కొనసాగిస్తారా లేకపోతే. ఈసీ ఉత్తర్వులను లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. తమకు వ్యతిరేకంగా ఈసీ నిర్ణయం రావడం బీజేపీ నేతల్ని కూడా ఆశ్చర్ పరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు...

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close