రంగంలోకి ప్రియాంక గాంధీ: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఫోకస్ పెడుతోంది. ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం ద్వారా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పూర్వ వైభవాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

దక్షిణాది రాష్ట్రాలలో ఒకప్పుడు బిజెపికి కనీస ఉనికి కూడా ఉండేది కాదు. కాంగ్రెస్ కంచుకోట గా ఉన్న ఈ రాష్ట్రాలలో బిజెపి ఇప్పుడు ఉనికి చాటుకోడమే కాకుండా, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో అధికారం లోకి రావడానికి కావలసినంతగా బలాన్ని పెంచుకుంది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ప్రధానంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య జరిగితే, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు , జిహెచ్ఎంసి ఎన్నికలు వంటివి అన్నీ కూడా ప్రధానంగా టిఆర్ఎస్ బిజెపి ల మధ్య జరగడం కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా ఇక్కడ తన ప్రభావాన్ని కోల్పోయింది అన్న దాన్ని సూచిస్తోంది. అయితే ఇంతకాలం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చుండి పోయిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు అన్నింటినీ నడిపించే బాధ్యతను ప్రియాంక గాంధీ కి అప్పగించడానికి సన్నాహాలు చేస్తోంది. ముందుగా ఈ రాష్ట్రాలన్నింటి ఇంచార్జ్ ల ను ప్రియాంక గాంధీకి నమ్మకమైన వ్యక్తులతో నింపేస్తారని, రానున్న ఉప ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడతారని, సాధారణ ఎన్నికల సమయానికి ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

అయితే కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు – ప్రత్యేకించి తెలంగాణ విషయంలో- చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్న రీతిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం పెద్దగా ఉనికిలో లేని బిజెపి, ఇవాళ తెలంగాణ లో తానే ప్రధాన ప్రత్యర్థి ని అని చాటుకునే స్థాయికి వచ్చేవరకు నిద్ర మత్తులో జోగిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు బిజెపి భావజాలం తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి ఎక్కిన తర్వాత వచ్చి చేయగలిగింది పెద్దగా లేదని వారి అభిప్రాయం. మరి ప్రియాంక గాంధీ కి నిజంగానే పూర్తిస్థాయి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ఇస్తారా, ఇస్తే ఆమె కాంగ్రెస్ కి పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలుగుతుందా అన్నది వేచి చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close