కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్.. కాపు ఓట్లన్నింటినీ సమీకరించి.. మరొక పార్టీకి అమ్మేస్తారని జగన్ మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ నేతలు వాళ్ల భావాలను తమపై రుద్దడం సరికాదన్నారు. ఒక్క కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు.

తాను సోషలిస్ట్ భావాలతో పెరిగిన వాడినని, కులాల గురించి తనకు అప్పట్లో తెలిసేది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరికాదని చెప్పానని, కులాలను ఆపాదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తనకు దగ్గరైన వ్యక్తి ఆనంద్ సాయి అని, యాదాద్రికి ఆర్కిటెక్ట్‌గా ఉన్నపుడే అతను బీసీ అని తెలిసిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితో జనసేనను స్థాపించామన్నారు. ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే మనం బలంగా ఏ విధంగా ఖండిస్తామో.. దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామని.. అదే సెక్యులరిజమని స్పష్టం చేశారు.

వైజాగ్‌లో పరిశ్రమల కాలుష్యం కానీ.. ఆక్వా వల్ల నీరు, భూమి కాలుష్యం ఆయిపోయింది.. వీటిని కాపాడటమే జనసేన బాధ్యతని ప్రకటించారు. ఓట్లు వస్తయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతానన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని, రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని, తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close