చివరికి మర్రిశశిధర్ రెడ్డి కూడా !

షెడ్డుకెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ పార్టీని మరింత దిగజార్చడానికి .. ఓపిక.. తీరిక చేుకుని మరీ మీడియా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాగున్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి.. హైకమాండ్ వద్ద పలుకుబడి సంపాదించుకుని.. చాలా కాలం హవా చూపించిన మర్రి శశిధర్ రెడ్డి చాలా కాలం నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నెత్తి మీద మరో దెబ్బకొట్టడానికి మీడియా ముందుకు వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లుగా.. పీసీసీ చీఫ్ పదవిని .. మాణిగం ఠాగూర్ అమ్ముకున్నారనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా మరో వ్యవస్థ నడుస్తోందని.. గాంధీ భవన్ కాకుండా మరో కార్యాలయం కూడా ఉందన్నారు. నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడనన్ని పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్నాయన్నారు. ప్రజలకు దూరమైన ఇలాంటి నేతలందరూ.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలుచేయకపోయినా కనీసం సైలెంట్‌గా ఉన్నా.. ఇంత కాలం తమను మోసిన పార్టీకి మేలు చేసిన వాళ్లయ్యే వారంటున్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినదంతా అనుభవించి ఇప్పుడు ఆ పార్టీనే టార్గెట్ చేయం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎలాగూ వారు యాక్టివ్‌గారాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీని డ్యామేజ్ చేసేలా మాట్లాడితే ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పెంచి పోషించిన నేతలు అలాటి వారే మరి.. ఎవరేం చేయగలరుఅని.. కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close