న‌రేష్ ఉగ్ర రూపమిదిగో

నాందితో అల్ల‌రి న‌రేష్ కొత్త చాప్ట‌ర్ మొద‌లైంది. ఆ సినిమాల‌తో మ‌ళ్లీ హిట్ బాట ప‌ట్టాడు న‌రేష్‌. అంతే కాదు…. న‌టుడిగానూ త‌న‌దైన మార్క్ వేశాడు. ఆ సినిమాతో విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌య్యాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా మొద‌లైంది. అదే.. `ఉగ్రం`. స‌న్ స్క్రీన్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. న‌రేష్ లుక్ డిఫ‌రెంట్ గా క‌నిపిస్తోంది. హెయిర్ స్టైల్ సైతం కొత్త‌గా ఉంది. ఒంటి నిండా ర‌క్తం, వీపులో గుచ్చుకొన్న క‌త్తి… తో న‌రేష్ గెట‌ప్ రివీల్ చేశారు. పోస్ట‌ర్ చూడ‌గానే.. నాంది త‌రహాలో ఇదో కొత్త ర‌క ప్ర‌య‌త్నం అనిపిస్తోంది. నాంది న్యాయ వ్య‌వ‌స్థ చుట్టూ అల్లుకొన్న క‌థ అయితే.. ఇదో థ్రిల్ల‌ర్‌. దాదాపుగా నాంది టీమే ఈ చిత్రానికి ప‌ని చేస్తోంది. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఈరోజే హైద‌రాబాద్ లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close