ఏపీలో తెలుగు వాడకపోతే జైలు !

తెలుగు మీడియం ఎత్తేసిన ఏపీలో తెలుగును వాడకకపోతే జైలు శిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వుల విప్లవంలో భాగంగా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు, వ్యవస్థలకు జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఈ విషయాన్ని అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ప్రకటించారు.

దుకాణాలపైన తెలుగులో పేర్లు రాయకపోయినా జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అసలు తెలుగు నేర్చుకోకుండా చేసి.. తెలుగు మీడియం రద్దు చేసి.. తెలుగులో ఉత్తర్వులు ఇవ్వకపోతే జరినిమా వేస్తాం.. బోర్డులు తెలుగులో రాయకపోతే జైలుకు పంపిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటన్న విస్మయం సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతోంది. మాతృభాషలో విద్యను నేర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని.. జాతీయ విద్యా విధానం కూడా స్పష్టంచేసింది. కానీ తెలుగు మీడియంను రద్దు చేయడం కోసం .. ఏకంగా సీబీఎస్‌ఈ విధానాన్నే అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది.

ఏ రాష్ట్రంలో అయినా మాతృభాషను ప్రాణంగా చూస్తూంటారు. మాతృభాషలో ప్రాథమిక చదువు ఉండేలా చూసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం అసలు మాతృభాషను మృతభాషగా మార్చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో నేర్పకుండా ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని.. బోర్డులు తెలుగులో పెట్టాలని జీవోలిస్తున్నారు. తాము తెలుగును కాపాడుతున్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులు నిబంధనలు గతంలోనే ఉన్నాయి..కానీ ఎవరు పాటిస్తున్నారు ? ఎవరు పట్టించుకుంటున్నారు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close