ఏపీ స్టేటస్‌కు ఇచ్చినట్లే బీహార్ స్టేటస్‌కు కేసీఆర్ సపోర్ట్ !

బీహార్ పర్యటనలో కేసీఆర్ ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సి ఉందని గట్టిగా చెప్పారు. ఆయన చెప్పిన విధానం చూసి చాలా మందికి గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో టీఆర్ఎస్ అనుసరించిన విధానం గుర్తుకు వచ్చింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు..ఆ పార్టీతో సంబంధాలు బాగా లేనప్పుడు ఆయన ఏపీకి హోదా ఇస్తే మా పరిస్థితేమిటని నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో కే కేశవరావు లాంటి వారు వ్యతిరేకించారు.

ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి .. టీఆర్ఎస్‌ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారో అప్పుడు ప్రత్యేకహోదాకు తెలంగాణ మద్దతు ప్రకటించిది. రెండు రాష్ట్రాల్లో 43 మంది ఎంపీలు వైసీపీ,టీఆర్ఎస్‌కు ఉంటే హోదా తీసుకు వస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఏపీ కి ప్రత్యేకహోదా కోసం తాము కూడా పోరాడతామన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆయన సైలెంటయ్యారు. కానీ ఏపీకి హోదా కు వ్యతిరేకంగా హరీష్ రావు లాంటి నేతలు.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా అనేక సార్లు ప్రకటనలు చేశారు.

ఇప్పుడు బీహార్‌లోనూ ఇదే ఫార్ములాను కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. బీహార్‌లో ప్రత్యేకహోదా అనేది చాలా కాలంగా రాజకీయ అంశం. స్వయంగా నితీష్ కుమార్ కూడా చాలా సార్లు అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీపైన విరుచుకుపడ్డారు. తర్వాత సైలెంటయ్యారు. దేశంలో ఎప్పుడు ప్రత్యేకహోదా ప్రస్తావన వచ్చినా.. బీహార్ నుంచి కూడా ” మాకూ కావాలన్న ” వాదన వినిపిస్తుంది. స్పెషల్ స్టేటస్‌ను ఏపీలోలాగానే బీహార్‌లోనూ కేసీఆర్ వాడుతున్నారన్న మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close