గోరంట్ల మాధవ్ “పరువు”తో వైసీపీ రాజకీయ ఆటలు !

గోరంట్ల మాధవ్ పరువును నడి బజార్లో పెట్టి అయినా సరే రాజకీయంగా లాభం పొందడానికి… వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నేతలు చేసిన డ్యామేజ్ చాలదన్నట్లుగా కొత్తగా వైసీపీ నేతలు ఆయనతో సీఐడీ కేసు పెట్టించారు. వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్న సమయంలో కొత్తగా ఎంపీ గోరంట్లతో సీఐడీకి ఫిర్యాదు చేయించారు. తన మీద కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. ఈ విభాగంపై సీఐడీ కేసులు పెట్టి వేధించవచ్చన్న ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఈ కేసులో ఇప్పటికే ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా… సీఐడీ.. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాసింది. రిప్లయ్ వచ్చింది. ఆ రిప్లయ్ బయట పెట్టలేదు కానీ ఆ వీడియో వర్జినల్ కాదని స్వయంగా సీఐడీ డీఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండా సీఐడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేసు నమోదు చేసినట్లుగా బయటకు వచ్చింది. ఈ కేసుతో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చు కానీ ముందు ముందు గోరంట్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

దర్యాప్తు సంస్థ చేతులు మారిదే ఈ కేసు ఆధారంగా విచారణ జరిపి అసలు వీడియోను వెలుగులోకి తెస్తారు. అప్పుడు మొత్తం బండారం బయట పడుతుంది. అదే జరిగితే గోరంట్ల మాధవ్ గురించిన రహస్యాలు చాలా బయటకు వస్తాయి.అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. వైసీపీ హైకమాండ్ చేతిలో పావుగా మారిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close