బాబుపై కుతకుతలాడిపోతున్న ఏపీ మంత్రి!

ఇసుక తీరువాల వేలం, ఆ రూపేణా ఇసుక మాఫియా చెలరేగిపోవడం.. అడ్డగోలు దోపిడీలు, దందాలు వందల కోట్ల రూపాయల అక్రమార్జనలకు అవకాశం.. ఇవన్నీ.. కొందరికి మాత్రం చాలా ఇంపుగా ఉంటాయి. దోచుకున్నంత వాళ్లకి దోచుకున్నంత మహదేవా అంటూ ఎక్కడికక్కడ అక్రమార్జనలకు లాకులు ఎత్తేసే ప్రబుద్ధులు ప్రతి సర్కారులోనూ ఉంటారు. అలాంటి ఒక మంత్రి ఇప్పుడు ఇసును ప్రజలకు ఉచితంగా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబునాయుడు మీద అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నట్లుగా సెక్రటేరియేట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇసుక మాఫియా అనేది దిన దిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ ఉంటే.. తనకు కూడా ఎక్కడికక్కడ కోట్లలో వాటాలు నికరంగా వచ్చి ఇనప్పెట్టెలో వాలిపోతూ ఉంటాయి అనేది… సదరు మంత్రిగారి సదాలోచన. కానీ.. ఇలా చంద్రబాబు కత్తెర వేసేయడం ఇప్పుడు వారికి కంటగింపుగా మారింది.

చంద్రబాబునాయుడు తొలిసారిగా.. ప్రతిపక్షానికి చెందిన ఫైర్‌బ్రాండ్‌ రోజా లాంటి వారు కూడా కీర్తించే, సమర్థించే పాలన పరమైన నిర్ణం తీసుకున్నారు. ఇసును ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది కావడం చంద్రబాబుకు ఖచ్చితంగా ఎడ్వాంటేజీనే! అయితే ఆయన సొంత కేబినెట్‌లోనే సొంత పార్టీలోనే ఇసుక మాఫియా ద్వారా అడ్డగోలు దందాలకు అలవాటు పడిపోయిన వారు మాత్రం ఈ నిర్ణయాన్ని సహించలేకపోతున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడివారికి అక్కడ వాటాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం పరమ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లోనే వ్యతిరేకత వస్తుందని పార్టీలో ఒక ప్రచారం పుట్టిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పట్టిన ఖర్మం ఏంటంటే.. ప్రతిపక్షం వారు కూడా శెభాష్‌ అని నిర్ద్వంద్వంగా అనే ఒక నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తీసుకుంటే, ఆయన సొంత పార్టీలోని మంత్రి దాన్ని సహించలేకపోవడం. కాకపోతే.. అంతో ఇంతో గుడ్డిలో మెల్ల లాంటి అదృష్టం ఏంటంటే.. జరగబోయే కేబినెట్‌ విస్తరణలో సదరు మంత్రిని కేబినెట్‌నుంచి తొలగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉండడం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close