బాల‌య్య‌ దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా..!

అన్ స్టాప‌బుల్ తో బాల‌య్య ఇమేజ్ దెబ్బ‌కు మారిపోయింది. ఆయ‌న ఫ్యామిలీస్‌కి మ‌రింత ద‌గ్గ‌రైపోయాడు. బాల‌య్య అంటే ప‌డ‌నివాళ్లుంటే… వాళ్లు కూడా ఆయ‌న‌కు అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ 2 సీజ‌న్‌కు ముహూర్తం కుదిరింది. అతి త్వ‌ర‌లోనే ఈ సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. `దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా..` అనే క్యాప్ష‌న్‌తో.. బాల‌య్య మ‌రోసారి హంగామా చేయ‌డానికి రెడీ అయిపోయాడు.

ఫ‌స్ట్ సీజ‌న్‌లో ప్ర‌తీ ఎపిసోడూ హైలెట్టే. మ‌హేష్‌బాబు, ర‌వితేజ‌ల ఎపిసోడ్లు అయితే.. కేక పుట్టించాయి. సీజ‌న్ 2లోనూ మాట్లాడుకోవ‌డానికీ, చెప్పుకోవ‌డానికీ, చూడ‌డానికీ చాలా విష‌యాలే ఉన్నాయి. ఇంకా చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి స్టార్లు బాల‌య్య‌తో ములాఖాత్ అవ్వాల్సివుంది. వీళ్లంద‌రినీ ఈ సీజ‌న్‌లో చూసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. చిరు, నాగ్‌, వెంకీ, బాలయ్య వీళ్లంతా స‌మ‌కాలికులే. దాదాపు ఒకేసారి స్టార్ డ‌మ్ చ‌వి చూశారు. చిత్ర‌సీమ‌కు మూల‌స్థంభాలుగా నిలిచారు. వీళ్లంద‌రినీ బాల‌య్య షోలో చూడ‌డం నిజంగానే ఓ గొప్ప అనుభూతి. సీజ‌న్ 2ని కొత్త త‌ర‌హాలో డిజైన్ చేసింద‌ట ఆహా! కొత్త కొత్త సెగ్మెంట్ల‌ని ప‌రిచ‌యం చేయ‌బోతోంద‌ట‌. తొలి ఎపిసోడ్‌ని ఎవ‌రితో చేయాలి అనేది కూడా ఫిక్స‌యిపోయిది. ఆ ఎపిసోడ్ తో ఘ‌నంగా సీజ‌న్ 2కు తెర తీయాల‌ని చూస్తోంది. ఆ స్టార్ ఎవ‌ర‌న్న‌ది నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close