వైఎస్ఆర్‌ను అవమానిస్తున్నారు.. జగన్‌పై షర్మిల డైరక్ట్ ఎటాక్ !

వైఎస్ కుమార్తె షర్మిల .. తన అన్న జగన్‌పై నేరుగా మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీేసి .. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదని షర్మిల స్పష్టం చేశారు. ఈ అంశంపై తన స్పందనను మీడియాకు తెలియచేసిన ఆమె.. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కు అవమానం జరుగుతుందన్నారు.

ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని ఆమె స్పష్టం చేశారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదని.. YSR కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారు.. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.

ఓ కుమార్తెగా తనను నాన్న ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని.. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరని ఆమె ప్రకటించారు. షర్మిల స్పందన సూటిగా సుత్తి లేకుండా ఉండటంతో అసెంబ్లీలో పేరు మార్పు కోసం జగన్ చేసిన సమర్థన.. బయట వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు తేలిపోతున్నట్లు అయ్యాయి. కొంత కాలంగా జగన్‌కు.. ఆయన సోదరి షర్మిల మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఎప్పుడూ నేరుగా జగన్ ను టార్గెట్ చే్యలేదు. తొలి సారి ఆయన నిర్ణయంపై మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close