లెక్క‌లు దాటేసిన ‘శాకుంత‌లం’

గుణ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర ఓ అల‌వాటు ఉంది. ఎంత చిన్న క‌థైనా.. భారీ స్థాయిలో చెబుతాడు. సెట్లూ, హంగుల‌కు భారీగా ఖ‌ర్చు పెడ‌తాడు. అందుకే తాను అనుకొన్న బ‌డ్జెట్ లో సినిమా ఎప్పుడూ పూర్తి చేయ‌లేడు. ‘శాకుంత‌లం’ విష‌యంలో ఇదే జ‌రిగింది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందించిన సినిమా ఇది. రూ.50 కోట్ల‌లో ఈ సినిమా పూర్తి చేయాల‌నుకొన్నాడు.కానీ ఇప్పుడు మొత్తం బ‌డ్జెట్ రూ.65 కోట్లు దాటేసింది. ఇంకా ప్రీ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్స్ ఉన్నాయి. స‌మంత ఇప్పుడు అనారోగ్యం పాలైంది. ఆమె కోలుకొని రావ‌డానికి టైమ్ ప‌డుతుంది. `శాకుంత‌లం` కూడా ఇప్ప‌ట్లో రిలీజ్ అవ్వ‌దు. దాంతో.. ఈ సినిమాపై వ‌డ్డీల భారం ప‌డ‌బోతోంది.

అయినా గుణ‌శేఖ‌ర్ ధీమాగానే ఉన్నాడు.ఎందుకంటే ‘శాకుంత‌లం’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నాడు. ఇదో విజువ‌ల్ ఫీస్ట్ కాబ‌ట్టి… భాష‌కు అతీతంగా ఈసినిమా చూస్తార‌న్న‌ది గుణ‌శేఖ‌ర్ న‌మ్మ‌కం. త్వ‌ర‌లో `య‌శోద‌` రిలీజ్ కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ‘య‌శోద‌’ హిట్ట‌యి, మంచి లాభాలొస్తే… `శాకుంత‌లం`కు అది ప్ల‌స్ అవుతుంది. అందుకే `య‌శోద‌` రిజ‌ల్ట్ ఏమ‌వుతుందా? అని గుణ‌శేఖ‌ర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. న‌వంబ‌రు 11న `య‌శోద‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close